Share News

సన్న బియ్యం ఇక నెల నెలా

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:45 AM

ఆహా ర భద్రత పథకంలో భాగంగా పేదలకు అందిస్తున్న బియ్యం సరఫరా జూలై కోటా విడుదలైంది.నేటినుంచి రేషన్‌ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. కొద్ది మాసాలుగా మూడు నెలలకు ఒకేసారి బియ్యం కోటా పం పిణీ చేస్తున్న పౌరసరఫరాలశాఖ జూలై మా సం నుంచి ప్రతీ నెల బియ్యం కోటాను లబ్ధిదారులకు అందజేయనుంది.

సన్న బియ్యం ఇక నెల నెలా

జూలై మాసం కోటా విడుదల

2.52లక్షల రేషన్‌కార్డులు, 5,036 మెట్రిక్‌ టన్నుల బియ్యం

యాదాద్రి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఆహా ర భద్రత పథకంలో భాగంగా పేదలకు అందిస్తున్న బియ్యం సరఫరా జూలై కోటా విడుదలైంది.నేటినుంచి రేషన్‌ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. కొద్ది మాసాలుగా మూడు నెలలకు ఒకేసారి బియ్యం కోటా పం పిణీ చేస్తున్న పౌరసరఫరాలశాఖ జూలై మా సం నుంచి ప్రతీ నెల బియ్యం కోటాను లబ్ధిదారులకు అందజేయనుంది. జిల్లాలో ఈమేరకు జూలైమాసం కోటా సన్నబియ్యం పంపిణీకి పౌ రసరఫరాలశాఖ కేటాయించింది. ఈ బియ్యం మండలస్థాయి స్టాక్‌ పాయింట్ల నుంచి గ్రామస్థాయిరేషన్‌ దుకాణాల ద్వారా జూలై 1వ తేదీ నుంచి పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేశారు.

2.52 లక్షల రేషన్‌కార్డులు

జిల్లాలోని 17 మండలాల్లో 2,52,187 తెల్లరేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా ఆ యా కుటుంబ సభ్యుల సంఖ్య ప్రకారం ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యా న్ని జిల్లాలోని 515 రేషన్‌దుకాణాల ద్వారా అందజేయనున్నారు. ఈ మేరకు జిల్లాలో రేషన్‌కార్డులకు సంబంధించి యూనిట్ల ఆధారంగా అవసరమైన 5,036 మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయింపులు చేశారు. జిల్లాలో 3,200 మెట్రిక్‌టన్నుల సన్నబియ్యం నిల్వలు ఉండగా, మరో 1,800 మెట్రిక్‌ టన్నులను జనగామ జిల్లా నుంచి కేటాయించారు. ఏప్రిల్‌ మాసంలో జూన్‌, జూలై కోటా కలిపి పంపిణీ చేసిన ప్రభుత్వం ఈసారి మాత్రం జూలై మాసానికి సంబంధించిన బియ్యం మాత్రమే పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఏ నెలకు అవసరమైన బియ్యం ఆ నెలలోనే లబ్ధిదారులకు అందనుంది.

జిల్లాలో రేషన్‌ పంపిణీ ఇలా..

మొత్తం రేషన్‌ దుకాణాలు : 515

ఆహార భద్రత కార్డులు : 2,38,460

అంత్యోదయ కార్డులు : 13,727

మొత్తం యూనిట్లు : 7,59,262

జూలై మాసం కోటా : 5,036మెట్రిక్‌టన్నులు

Updated Date - Jul 01 , 2026 | 12:45 AM