గ్యాస్ కొరతలో వాస్తవం లేదు
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:29 AM
అమెరికా-ఇరాన్‌కు యుద్ధ నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్టు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో వారు మాట్లాడారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో మంత్రులు ఉత్తమ్, తుమ్మల
భువనగిరి రూరల్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): అమెరికా-ఇరాన్‌కు యుద్ధ నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్టు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో వారు మాట్లాడారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న నేపథ్యంలో కొరతపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులకు సూచించారు. రో జువారీగా 72శాతం బుకింగ్‌లు జరుగుతున్నాయని, గృహ వినియోగదారులతో పాటు ఆస్పత్రులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్య క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉం దన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ, యాసంగి ధాన్యం సేకరణకు గన్నీ బ్యాగులు, నిల్వలకు గోదాంలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అనురాగ్‌జయంతి, అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, డీఏవో పీవీ.రమణారెడ్డి, డీసీఎ్‌సవో రోజారాణి, మార్కెటింగ్ డీఎం సబిత, ఉద్యానశాఖ అధికారి మాధవి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ఎలాంటి కొరత లేదు : కలెక్టర్
జిల్లాలో గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ కొరత లేదని కలెక్టర్ అనురాగ్‌జయంతి అన్నారు. శుక్రవారం ఎస్పీ అక్షాంశ్‌యాదవ్, అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, పౌరసరఫరాల, రెవెన్యూశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గృహ అవసరాలు, విద్యాలయాలు, వసతి గృహాలు, కేజీబీవీ, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రులకు గ్యాస్ సమస్య రాకుండా చూసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లను ఆదేశించారు. గ్యాస్ ఇబ్బందులు ఏర్పడితే కంట్రోల్ రూం నెంబర్ 9281423623లో సంప్రదించాలన్నారు.
‘సర్’ ప్రక్రియను పూర్తిచేయాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
భువనగిరి రూరల్, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించాలన్నారు. సూపర్‌వైజర్లు, ఏఈఆర్‌వోలు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఈ ప్రక్రియను చేపట్టాన్నారు. ఒక వ్యక్తి పేరుతో రెండు చోట్ల ఓటు ఉండకుండా జాబితాను పరిశీలించాలన్నారు. రాజకీయ పార్టీల ద్వారా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అనురాగ్‌జయంతి, అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, పాల్గొన్నారు.