వ్యవసాయ మోటర్ల కేబుల్ వైర్ చోరీ
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:28 AM
గరిడేపల్లి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సుభా్‌షనగర్ గ్రామంలో రైతుల వ్యవసాయ మోటర్ల వైర్ చోరీకి గురయ్యాయి.
పంట పొట్ట దశలో రైతుల ఇబ్బందులు
గరిడేపల్లి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సుభా్‌షనగర్ గ్రామంలో రైతుల వ్యవసాయ మోటర్ల వైర్ చోరీకి గురయ్యాయి. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుమారు 20 మంది రైతుల వ్యవసాయ మోటర్ల వైర్లు దొంగలు కత్తిరించుకుపోయారు. మంగళవారం ఉదయం రైతులు పొలాలకు నీళ్లు పెట్టెందుకు వెళ్లిన రైతులు గమనించారు. సబ్‌మెర్సిబుల్ మోటర్ నుంచి మెయిన్ బోర్డు వరకు ఉండే కేబుల్ వైర్లు కత్తిరించి ఉండడాన్ని చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 20 మోటర్ల వరకు వైర్లు కత్తిరించారని, రైతులు గాదె మల్లారెడ్డి, జానపాటి శంకర్, నంద్యాల రాంరెడ్డి, కుసుమ సైదిరెడ్డి, కాంతారెడ్డి తెలిపారు. ఒక్కో మోటర్ వద్ద సుమా రు 40 మీటర్ల వైరు కత్తిరించా రు. ఈ వైరు మీటర్‌కు రూ.150 చొప్పున 20 మోటర్ల నుంచి దాదాపు రూ.లక్ష విలువ కలిగిన వైర్లు కత్తిరించుకెళ్లారని రైతులు వాపోతున్నారు. గతంలో మూడు సార్లు ఇలా కత్తిరించారని ఎవరికి వారు మళ్లీ వైర్లు తెచ్చుకొని వేశామని ఇప్పుడు పంటలు పొట్ట దశ లో ఉన్నాయని ఇలాంటి సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పుడు ప్రతి మోటర్‌కు రు.3,500 ఖర్చు చేసి కేబుల్ వైరు కొనాల్సి వస్తుందని, మళ్లీ ఏ రోజు దొంగలు ఎత్తుకెళ్తారో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి దొంగలను పట్టుకొని రైతులను కాపాడాలని వారు వేడుకుంటున్నారు.