Share News

చేనేత సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:33 AM

చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత పరిశ్రమ అభివృద్ధి, మార్కెటింగ్‌ సౌకర్యాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

చేనేత సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఫఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

భూదానపోచంపల్లి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత పరిశ్రమ అభివృద్ధి, మార్కెటింగ్‌ సౌకర్యాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పోచంపల్లి చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం సోమవారం పదవీ బాధ్యతలు సంఘం భవనంలో స్వీకరించింది. అనంతరం చేనేత సహకార సంఘం భవనం ఆవరణలోని ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ, నేతన్న విగ్రహాలకు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోచంపల్లి చేనేత ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వంతోపాటు చేనేత పారిశ్రామికులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలన్నారు. పోచంపల్లి అంటేనే పట్టు చీరలు, ఇక్కత కళ గుర్తుకు వస్తుందని, పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కతకు దేశవ్యాప్తంగా పేరుందన్నారు. రెండేళ్ల క్రితం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి సందర్శించి పోచంపల్లి ఇక్కత డిజైన్లను రూపొందిస్తున్న ఇక్కడి చేనేత కళాకారుల కళాత్మక నైపుణ్యాన్ని ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు. పోచంపల్లి చేనేత కళాకారుల ప్రతిభ దేశానికే గర్వకారణమని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన మిస్‌ వరల్డ్‌ కాంటెస్టీస్‌ పోచంపల్లిలో ఇక్కత వసా్త్రలతో నిర్వహించిన ఫ్యాషనషో తెలంగాణ రాషా్ట్రనికే గర్వకారణం అని అన్నారు. త్రెడ్‌ పోచంపల్లి ద్వారా జాతీయ స్థాయిలో పోచంపల్లి ఇక్కతకు ప్రాచుర్యం లభించిందన్నారు. ఈ ప్రదర్శనలో రూ.10 కోట్ల మేరకు చేనేత వసా్త్రలు విక్రయించడం పోచంపల్లి ఇక్కతకు ఉన్న ఆదరణకు తర్కాణమని అన్నారు. చేనేత సహకార సంఘాలు మరింత బలోపేతం కావాలన్నారు. చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత లవకుమార్‌ మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేసేందుకు సంఘం క్యాడిట్‌ను రూ.3 కోట్లకు పెంచాలని కోరారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తమ కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు సంఘం సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళీ శాఖ ఏడీ శ్రీనివా్‌సరావు, మునిసిపల్‌ చైర్మన తడక వెంకటేశ్వర్లు, మునిసిపల్‌ వైస్‌ చైర్మన కొయ్యడ రజనీశ్రీనివా్‌సగౌడ్‌, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత లవకుమార్‌, వైస్‌ చైర్మన సీత శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి సూరపల్లి శ్రీనివాస్‌, కోశాధికారి కోడి భిక్షపతి, డైరెక్టర్లు పాలాది జ్యోతి, మహేశ్వరం నాగమణి, కడవేరు చంద్రమౌళి, గంజి బసవలింగం, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, పద్మశ్రీఅవార్డు గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 12:33 AM