నృసింహుడి సన్నిధిలో కార్తీక శోభ
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:31 AM
కార్తీక మాసంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యా దగిరిగుట్ట ఆధ్యాత్మిక శోభను సంతరించుకోంది. యాదగిరి లక్ష్మీనృసింహుల సన్నిధిలో మూడు రోజులపాటు కార్తీక ఉత్సవాలు, కార్తీ క పౌర్ణమి రోజున అన్నకూటోత్సవం, ఆకాశ దీపోత్సవం నిర్వహించేందుకు యాదగిరిగుట్ట దేవస్థానం, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఏర్పాట్లు చేసింది.
నేటినుంచి 22 వరకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలు
తొలి రోజు కోటి పుష్పార్చనతో ఉత్సవ శ్రీకారం
రెండో రోజు ఆర్పీపట్నాయక్ సంగీత విభావరి
విస్తృత ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం, దేవస్థానం
కార్తీక పౌర్ణమి 24న అన్నకూటోత్సవం, ఆకాశదీపోత్సవం
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): కార్తీక మాసంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యా దగిరిగుట్ట ఆధ్యాత్మిక శోభను సంతరించుకోంది. యాదగిరి లక్ష్మీనృసింహుల సన్నిధిలో మూడు రోజులపాటు కార్తీక ఉత్సవాలు, కార్తీ క పౌర్ణమి రోజున అన్నకూటోత్సవం, ఆకాశ దీపోత్సవం నిర్వహించేందుకు యాదగిరిగుట్ట దేవస్థానం, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఏర్పాట్లు చేసింది. సాంస్కృతిక వైభవాన్ని ప్రజలకు పరిచయం చేయడం లక్ష్యంగా ఉత్సవాలను రూపొందించినట్లు కలెక్టర్ అనురాగ్‌జయంతి తెలిపారు.
నృసింహుడి సన్నిధిలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు కార్తీక ఉత్సవాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తి సంగీత విభావరి, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించనున్నాయి. ఈ నెల 24న కార్తీక పౌర్ణమి రోజున ప్రఽధానాలయంలో అన్నకూటోత్సవ గోష్టి, ధ్వజస్తంభ పూజలు, ఆకాశదీపోత్సవాలు ఆధ్మాత్మిక శోభను తీసుకురానున్నాయి. కార్తీక మాస పవిత్రతను, భారతీయ సనాతన ధర్మ సంప్రదాయాలు, తెలంగాణ కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రజలకు పరిచయం చేయడం లక్ష్యంగా ఉత్సవాలను రూపొందించినట్లు కలెక్టర్ అనురాగ్‌జయంతి, ఆలయ ఈవో జె.భవానీ శంకర్ తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, భక్తిసంగీత విభావరీల నిర్వహణకు ప్రత్యేకంగా విశాలమైన వేదికను ఏర్పాటుచేస్తున్నారు. కార్తీక వేడుకల సందర్భంగా ఆలయ అష్టభుజిప్రాకర మండపాలను, సప్తగోపుర సముదాయాలు విద్యుద్ధీపకాంతుల్లో మెరిసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నారు. ఈసందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీ్‌సశాఖ ట్రాఫిక్ క్రమబద్దీకరణ, భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తుండగా, మిషన్‌భగీరథ నీటి సరఫరా నిరంతరం కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది. ఆర్టీసీ అధికారులు భక్తుల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక బస్సుసర్వీసులు నడిపించనుంది.
తొలిరోజు కోటి పుష్పార్చన
ఈ నెల 20న ఉదయం ప్రధానాలయ ము ఖ మండపంలో లక్ష్మీనృసింహులకు కోటి పుష్పార్చన నిర్వహించనున్నారు. సుగంధ పరిమళ పుష్పాల తో కోటి దివ్యనామ స్మరణలతో ఆలయ అర్చకులు, వేదపండితులు విశ్వశాంతి, లోకకల్యాణంకోసం ఈ ఆధ్యాత్మిక వేడుకను వైభవంగా నిర్వహించనున్నారు. అదేరోజు సా యంత్రం ఆరుగంటలకు మాడుగుల నాగఫణి శర్మ ఆధ్యాత్మిక ప్రవచనం, ప్రసిద్ధ తెలంగాణ జానపద గాయకురాలు తేలు విజయ బృందం భక్తిసంగీత విభావరి నిర్వహించనున్నారు.
మరుసటి రోజు ఆర్పీ పట్నాయక్ సంగీత విభావరి
కార్తీక ఉత్సవాల రెండో రోజు 21న సాయం త్రం సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీత విభావరి జరుగనుంది. కార్యక్రమంలో ప్రముఖ గాయనీగాయకులు నిహాల్, నిత్యసంతోషిని, గోపిక పూర్ణిమ, శ్రీనిధి, జర్నలిస్టు స్వప్న తదితరులు పాల్గొననున్నారు.
చివరి రోజు శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు
కార్తీక ఉత్సవాల చివరి రోజు 22న ఒడిస్సీ, పేరణీసహా శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశా రు. రుద్రాక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒడిస్సీ నృత్య ప్రదర్శన, పరంపర సంస్థ కు చెందిన అభినేత్రి బృందం తెలంగాణ ఆలయాల వైభవం ప్రత్యేక నృత్య రూపకం, కళా కృష్ణబృందం పేరిణీ నృత్య ప్రదర్శనను ఇవ్వనున్నారు. ఈ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు తెలంగాణ ప్రాచీన దేవాలయాల చరిత్ర, శిల్ప కళావైభవం, ఆధ్మాత్మిక విశిష్టత, సంప్రదాయాలను చాటనున్నాయి.
ఈ నెల 24న అన్నకూటోత్సవం.. ఆకాశదీపోత్సవం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఈ నెల 24న కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని అన్నకూటోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారి నిత్యకల్యాణం అనంతరం ప్రధానాలయంలో మధ్యాహ్నం 11.45 గంటల నుంచి 1.30వరకు అన్నకూటోత్సవ గోష్టిని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు. అదేరోజు సాయంత్రం 6గంటలకు ధ్వజ స్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకాశ దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. మూడు రోజుల కార్తీక ఉత్సవాలతోపాటు కార్తీక పౌర్ణమి రోజున భక్తులు అధికసంఖ్యలో హాజరుకానుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు ప్రకటించారు.
కార్తీకోత్సవ ఏర్పాట్లలో అపశ్రుతి
యాదగిరిగుట్ట: ఆలయ సన్నిధిలో శుక్రవారం నుంచి నిర్వహించనున్న కార్తీకోత్సవ ఏర్పాట్లలో అపశ్రుతి దొర్లింది. ఈ నెల 20వ తేదీన కార్తీకోత్సవాల్లో భాగంగా లక్ష్మీనృసింహులకు కోటి పుష్పార్చన నిర్వహణకు ఉత్సవమూర్తులను అధిష్ఠింపజేసే సభావేదిక ఎదుట భక్తులకు సౌకర్యానికి గురువారం పెండాల్స్‌ను ఏర్పాటు చేస్తుండగా బలమైన గాలులు వీయడంతో, పెండాల్స్ కోసం అమర్చిన ఇనుపరాడ్స్ ఆలయ మాడవీధుల్లో వెళుతున్న భక్తులపై పడి 10మంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆలయ సిబ్బంది హుటాహుటిన వారికి ప్రథమచికిత్స అందించి భువనగిరి ఏరియా ఆసుపత్రిలో మెరుగైన చికిత్స చేయించారు. ఈ ఘటనలో స్వల్పగాయాలతో బయటపడటంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.