అమరుల త్యాగఫలం..స్వరాష్ట్ర ఆవిర్భావం
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:31 AM
అమరుల త్యాగాల ఫలితంగానే స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని పలువురు వక్తలు అన్నారు.
ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు
జిల్లా వ్యాప్తంగా జాతీయ జెండాల ఆవిష్కరణ
(ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్)
అమరుల త్యాగాల ఫలితంగానే స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని పలువురు వక్తలు అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మంగళవారం జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. భువనగిరిలోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ యాదవ్ తదితర ప్రముఖులు నివాళులర్పించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక అదనపు జిల్లా న్యాయమూర్తి మిలింద్ కాంబ్లీ, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అక్షాంశయాదవ్, మునిసిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన తంగేళ్లపల్లి శ్రీవాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో చైర్మన ఎండీ.అవేజ్ చిస్తీ జాతీయ జెండాను ఎగురవేశారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కాగా తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్, టీజేఏసీ చైర్మన మెరుగు మధు ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఉద్యమకారులు నివాళులర్పించి ప్రభుత్వ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. ఈమేరకు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డికి వినతి పత్రం అందచేశారు. కాగా బీఆర్‌ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేయగా మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. భువనగిరి బీయనతిమ్మాపూర్ సర్పంచ ఎడ్ల వెంకట్ రెడ్డి, తాజ్‌పూర్ సర్పంచ ర్యాకల సంతోష శ్రీనివాస్, తుక్కాపురంలో సర్పంచ జనగాం పాండు జెండాను ఆవిష్కరించారు. అదే విధంగా జిల్లా పరిషత కార్యాలయ ఆవరణలో సీఈవో శోభారాణి, పంచాయతీ రాజ్ జిల్లా కార్యాలయంలో ఈఈ దాసయ్య, డీటీవో కార్యాలయంలో డీటీవో సాయికృష్ణ, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో జగనమోహన ప్రసాద్ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. భువనగిరిలోని అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ, పీఎంసీ కన్వీనర్ సురుపంగ శివలింగం పూలమాలవేసి నివాళులర్పించారు. పూస శ్రీనివాస్, మెరుగు మధు, మాటూరి అశోక్, కొత్త బాలరాజు, జర్నలిస్ట్ అసోసియోషన నాయకులు పోతంశెట్టి కరుణాకర్, కొడిమాల కృష్ణ, బండారు రవివర్ధన, కొలుపుల రమేష్, రాయగిరి శంకర్, లక్ష్మణ్, సహదేవ్, ఎట్టయ్య పాల్గొన్నారు. ఆలేరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాయంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మలివిడత తెలంగాణ ఉద్యమ వీరులకు జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గందమల్ల అశోక్, కట్టెగుమ్ముల విద్యాసాగర్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన బీజని బాలమణిభాస్కర్, వైస్ చైర్మన అంగడి అంజనేయులు, కౌన్సిలర్లు, నాయకులు నీలం వెంకటస్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమకారులను సన్మానించారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన వస్పరి శంకరయ్య, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఉద్యమకారులను సన్మానించారు. నాయకులు కందడి మణిపాల్‌రెడ్డి, ఎర్ర జాన్సన, పూల నాగయ్య పాల్గొన్నారు. యాదరిగుట్ట మునిసిపాలిటీలో ప్రభుత్వ విప్ అయిలయ్య, మునిసిపల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణీభరత్‌గౌడ్, వైస్ చైర్ పర్సన్ బరిగె రమ్యారాంచందర్, కమిషనర్ బర్ల శ్రీనివాస్, కౌన్సిలర్లు బోడ రాధ, బూడిద మధు, కాటబత్తిని స్వప్నఆంజనేయులు పాల్గొన్నారు. యాదగిరికొండపై క్యాంపు కార్యాలయం ఆవరణలో ఆలయ ఈవో భవానీశంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి, డీఈవో ప్రతాప నవీనకుమార్‌శర్మ, ఏఈవోలు జూశెట్టి క్రిష్ణ, జాటోతు శంకర్‌నాయక్, గజ్వేల్లి రఘు పాల్గొన్నారు. చౌటుప్పల్‌లో మునిసిపల్ చైర్‌పర్సన మొగుదాల పావనిరమేష్ గౌడ్, ఆర్డీవో శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ వీరాబాయి, ఏఎంసీ చైర్మన ఉబ్బు వెంకటయ్య, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సీఐ మన్మథ కుమార్, ఏవో ఎం.నాగరాజు, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. మోత్కూరులో మునిసిపల్ చైర్‌పర్సన గడ్డం స్వప్నసోమనర్సయ్య, మార్కెట్ చైర్‌పర్సన నూనెముంతల విమలవెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన పేలపూడి వెంకటేశ్వర్లు, పోలీస్ ఇనస్పెక్టర్ వెంకటేశ్వర్లు, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బద్దం యాదిరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు, గ్రంథాలయ చైర్మన కోమటి మత్స్యగిరి, చేనేత సంఘం అధ్యక్షుడు రాములు పాల్గొన్నారు కాగా వేడుకల్లో తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని అధికారుల తీరుపై స్థానిక నాయకులు, పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అడ్డగూడూరులో తహసీల్దార్ శేషగిరిరావు, ఎంపీడీవో శంకరయ్య, ఎస్.ఐ వెంకట్‌రెడ్డి, మండల వైధ్యాధికారి భార్గవి ఉన్నారు. గుండాలలో తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీవో చండీరాణి, ఎస్‌ఐ శోభనబాబు, మండల వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ఆత్మకూరు(ఎం)లో తహసీల్దార్ వి.లావణ్య, ఎంపిడివో రాములు, ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, సర్పంచ బీసు ధనలక్ష్మి, ప్యాక్స్ చైర్మన జి.శేఖర్‌రెడ్డి, మండల విద్యాఽధికారి కె.మహదేవరెడ్డి పాల్గొన్నారు. మోటకొండూరులో ఎంపీడీవో ఇందిర, తహసీల్దార్ రాజేంద్రప్రసాద్, ఎస్‌ఐ అశోక్, సర్పంచ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్ ఉన్నారు. వలిగొండలో తహసీల్దార్ దశరథ, మండల ప్రత్యేక అధికారి జగన్నాథరావు, సర్పంచ వెంకటపాపిరెడ్డి, ఏఎంసీ చైర్మన భీమానాయక్, ఎస్‌ఐ యుగంధర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన సురకంటి వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో జలంధర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. భూదానపోచంపల్లిలో తహసీల్దార్ శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీడీవో విజయ, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్ ఏపాల సత్యనారాయణరెడ్డి, ఏవో శైలజ, పీఏసీఎస్ చైర్మన కందాడి భూపాల్‌రెడ్డి, వైస్ చైర్మన సామ మోహనరెడ్డి, మునిసిపల్ చైర్మన తడక వెంకటేశ్వరు, కమిషనర్ అంజనరెడ్డి, పీహెచసీ వైద్యాధికారి శ్రీవాణి పాల్గొన్నారు. రాజాపేట మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో, వివిధ పంచాయతీల్లో జాతీయ పతాకాలను ఎగురవేశారు. బొమ్మలరామారంలో భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన, రాజేశపైౖలట్, పీఎసీఎ్‌స చైర్మన గూదె బాలనర్సయ్య పాల్గొన్నారు. సంస్థాననారాయణపురంలో తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, సూపరింటెండెంట్ సుధాకరాచారి, ఎస్‌ఐ జగన, సర్పంచ ఉప్పల విజయలక్ష్మి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.