Share News

డిజిటల్‌ చెల్లింపుల జోరు

ABN , Publish Date - May 01 , 2026 | 12:12 AM

లావాదేవీల్లో డిజిటల్‌ పే మెంట్స్‌ జోరు కొనసాగుతోంది. కిరాణా దుకాణంలో రూపాయి కొను గోలు మొదలు ఎలక్ర్టానిక్‌, జ్యూయెలరీ షాపుల్లో లక్షల విలువైన బిల్లులు కూడా డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారా చెల్లిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా కండక్టర్‌ వద్ద ఉండే క్యూఆర్‌ కోడ్‌కు ప్రయాణికులు స్కాన్‌ చేసి టికెట్లు పొందుతున్నారు.

డిజిటల్‌ చెల్లింపుల జోరు

మార్చిలోనే రూ.7.48కోట్లు విద్యుత్‌ బిల్లుల చెల్లింపు

కిరాణా దుకాణం మొదలు జ్యూయెలరీ షాపుల వరకు

భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): లావాదేవీల్లో డిజిటల్‌ పే మెంట్స్‌ జోరు కొనసాగుతోంది. కిరాణా దుకాణంలో రూపాయి కొను గోలు మొదలు ఎలక్ర్టానిక్‌, జ్యూయెలరీ షాపుల్లో లక్షల విలువైన బిల్లులు కూడా డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారా చెల్లిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా కండక్టర్‌ వద్ద ఉండే క్యూఆర్‌ కోడ్‌కు ప్రయాణికులు స్కాన్‌ చేసి టికెట్లు పొందుతున్నారు. విద్యుత్‌ బిల్లుల వసూళ్ల కోసం లైన్‌మన్‌ తదితర సిబ్బం ది కనెక్షన్లు ఉన్న గృహాలు, దుకాణాలు, పరిశ్రమల చుట్టూ తిరిగే వారు, కొద్దిమంది వినియోగదారులు సబ్‌స్టేషన్లలోనే కౌంటర్లలో బిల్లులు చెల్లించే వారు. ఇప్పటికీ ఈ తరహా చెల్లింపులు జరుగుతున్నాయి. పలు ప్రాంతా ల్లో బిల్లు వసూలు కేంద్రాల ఏర్పాటుకు డిమాండ్‌ ఉండేది. డిజిటల్‌ పే మెంట్స్‌తో ఏటీఎం కేంద్రాలు వెలవెలబోతున్నాయని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. అన్నిరంగాల్లో మాదిరిగానే ట్రాన్స్‌కోలో కూడా డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారా బిల్లుల చెల్లింపు గణనీయంగా పెరుగుతోంది. దీంతో బిల్లుల చెల్లింపుల పారదర్శకతతో పాటు నేరుగా ఖాతాలోనే బిల్లు మొ త్తాలు జమ అవుతుండడంతో అకౌంట్స్‌ విభాగానికి ఆందోళన తప్పుతోంది. జిల్లాలో మార్చినెల విద్యుత్‌ చార్జిలలో 76వేల సర్వీసుల నుంచి రూ.7.48కోట్ల బిల్లు డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారా ట్రాన్స్‌కో ఖాతాలో జమ అయ్యాయి.

అత్యధికంగా విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు

జిల్లాలో మార్చి నెల విద్యుత్‌ చార్జిల బిల్లులు ఏప్రిల్‌లో డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారా రూ.7,48,51,603 చెల్లింపులు జరిగాయి. జిల్లాలో మార్చి నెల విద్యుత్‌ చార్జిల కోసం రూ.19.48కోట్ల డిమాండ్‌తో 2,91,410 బిల్లులు జారీ అయ్యాయి. 2,44,372 గృహ కనెక్షన్లలో 1,50,091 గృహజ్యోతి పరిధిలో 200యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించుకోవడంతో వారికి రూ. 4,25,99,764 సబ్సిడీ లభించింది. దీంతో 1,41,319 సర్వీసుల నుంచి రూ.15,58,41,236 చార్జిల వసూలు ఉంది. ఆన్‌లైన్‌, ఫోన్‌పే, గూగుల్‌పే, క్యూఆర్‌ కోడ్‌, పేటీఎం, టీ వ్యాలెట్‌ తదితర డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారా మార్చినెల బిల్లులు ఇప్పటి వరకు రూ.7,48,51,603చెల్లింపులు జరిగాయి. వీటిలో పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల బిల్లుతో పాటు డొమెస్టిక్‌ బిల్లులు పేమెంట్స్‌ ఉండడం విశేషం. రానున్న కాలంలో డిజిటల్‌ పేమెంట్స్‌ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రాన్స్‌కో అధికారులు భావిస్తున్నారు.

ముందస్తు సమాచారం..

డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారా బిల్లుల స్వీకరణ అమలు చేస్తున్న ట్రాన్స్‌కో బిల్లుల చెల్లింపు చార్జిల వివరాలను ముందస్తుగానే మెసేజ్‌ రూపంలో అందుతున్నాయి. తమ స్మార్ట్‌ ఫోన్‌లోని ప్లే స్టోర్‌లో టీఎస్‌ ఎన్డీపీసీఎల్‌ అని టైప్‌ చేసి యాప్‌ను డైన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీనిలో విద్యుత్‌ బిల్లుపై ఉన్న యూఎన్‌సీ నెంబర్‌ నమోదు చేసుకుని ప్రతినెలా బిల్లులను సులభంగా చెల్లించవచ్చు. అలాగే ప్రతినెలా చెల్లించాల్సిన బిల్లుపై ముందస్తు సమాచారం అందుతుంది. ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి యాప్‌ల ద్వారా విద్యుత్‌ బిల్లును చెల్లించవచ్చు.

Updated Date - May 01 , 2026 | 12:12 AM