తైబజార్ వేలం యోచన విరమించుకోవాలి
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:06 AM
ఆలేరు, ఆగస్టు5 (ఆంధ్ర జ్యోతి) : ఆలేరు మునిసిపాలిటీలో తైబజార్ వేలం పాట నిర్వహించాలన్న యోచనను వెంటనే విరమించుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు
ఆలేరు, ఆగస్టు5 (ఆంధ్ర జ్యోతి) : ఆలేరు మునిసిపాలిటీలో తైబజార్ వేలం పాట నిర్వహించాలన్న యోచనను వెంటనే విరమించుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మునిసిపాలిటీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సీపీఎం పట్టణ నాయకుడు మొరిగాడి రమేష్ మాట్లాడుతూ వారం రోజుల క్రితం మునిసిపాలిటీ పాలకవర్గం సమావేశం నిర్వహించి ప్రజలకు భారమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడాన్ని పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. మునిసిపాలిటీ అభివృద్ధికి తై బజార్ వేలం వేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. అనంతరం మునిసిపల్ కమిషనర్ శ్రీనివా్‌సరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వడ్డేమాన్ బాలరాజు, అశోక్, అంజయ్య, మల్లేష్, కృష్ణయ్య, రాజు, ప్రసాద్ కలీల్ పాల్గొన్నారు.