ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:57 AM
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం, సహకారంతో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు. జిల్లా కేంద్రంలోని లైన్‌వాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరా న్ని ప్రారంభించి, మాట్లాడారు.
నల్లగొండ టౌన్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం, సహకారంతో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు. జిల్లా కేంద్రంలోని లైన్‌వాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరా న్ని ప్రారంభించి, మాట్లాడారు. పేదవారికి ప్రత్యేక వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశా ల మేరకు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య, ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఆరు రకాల ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాలకు వైద్య నిపుణులు హాజరవుతారని వివరించారు. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని, తద్వారా భవిష్యత్‌లోనూ వైద్యసేవలు అందించనున్నట్లు వెల్లడించారు. వైద్య నిపుణులు ప్రతి రోజూ రెండు, మూడు వైద్యశిబిరాలను చూసుకుంటూ అన్ని పీహెచ్‌సీల్లోనూ పర్యటిస్తారన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీల్లో పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఫైళ్ల పరిష్కారం కూడా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం వైద్యశిబిరానికి వచ్చిన వారితో ఆయన ముచ్చటించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ నరసింహారావు, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, లైన్ వాడ యూపీహెచ్‌సి వైద్యురాలు ఇఫ్తేయార్ తదితరులున్నారు.
చేతివృత్తుల కళలకు మంచి అవకాశాలు
నల్లగొండ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద చేతివృత్తుల కళల ప్రోత్సాహానికి మంచి అవకాశాలు ఉన్నాయని, లబ్ధిదారులు కష్టపడి వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సూక్ష్మ ,మధ్య, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారుల వాణిజ్య ప్రదర్శనను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఎంఎ్‌సఎంఈ ఆధ్వర్యంలో చేతివృత్తులను ప్రోత్సహిస్తూ వ్యాపారాలను వృద్ధి చేసుకునేందుకు మంచి అవకాశం ఉందన్నారు. వివిధ చేతి వృత్తిదారులు తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. ప్రభుత్వ రుణాన్ని 18 నెలల్లో చెల్లిస్తే రెండో విడత రూ.2లక్షలు మంజూరు చేస్తారన్నారు. జిల్లాలో 3,580 మంది లబ్ధిదారులు ఎంఎ్‌సఎంఈ కింద దరఖాస్తులు చేసుకున్నారని, వారందరికీ శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణాంతరం వ్యాపార మెలకువలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్, ఎల్డీఎం శ్రామిక్, మెప్మా పీడీ శ్రీనివాస్, బీసీ సంక్షేమ అధికారి సంజీవ, పోస్టల్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.