ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:12 AM
ఆర్జిజన్ల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విద్యుత ఆర్టిజన ఉద్యోగుల జాయింట్ యాక్షన కమిటీ పిలుపుమేరకు గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సర్కిల్ ఆఫీస్ ముందు టీవీఏజేఏసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన, కన్వీనర్ల అధ్యక్షతన వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.
నల్లగొండ టౌన, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : ఆర్జిజన్ల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విద్యుత ఆర్టిజన ఉద్యోగుల జాయింట్ యాక్షన కమిటీ పిలుపుమేరకు గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సర్కిల్ ఆఫీస్ ముందు టీవీఏజేఏసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన, కన్వీనర్ల అధ్యక్షతన వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి, 327 కంపెనీ అధ్యక్షుడు సురే్‌షకుమార్, 1104 రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వెంకటయ్య, సీఐటీయూ రాష్ట్ర నాయకుడు వీరారెడ్డి, కార్యదర్శి ఎండీ సలీం, ఏఐటీయూసీ దేవేందర్‌రెడ్డి, 327 జిల్లా కార్యదర్శి నిరంజనవలీ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సమ్మిరెడ్డి, టీఆర్వీకేఎస్ ఊశయ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యూనియన నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. ఆర్టిజన్లకు స్టాండింగ్ రూల్స్ వర్తింపజేయడం దారుణమని భూపాల్‌రెడ్డి అన్నారు. ఏపీఎ్‌సఈబీ రూల్స్ వర్తింపజేయడం, ఆర్టిజన కాని కార్మికులను ఆర్టిజన్లగా గుర్తించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో టీవీఏజేఏసీ రాష్ట్ర కన్వీనర్ సాయిల్, రాష్ట్ర నాయకులు ఎల్లయ్య, టీవీఏజేఏసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన కన్వీనర్లు జిట్టబోయిన లింగస్వామియాదవ్, మద్ది శ్రీనివా్‌సయాదవ్, నాయకులు రమేష్, సహదేవ్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, విశ్వం, కృష్ణ, వేణుగోపాల్‌రెడ్డి, ఉమాదేవి, శేఖర్, విజయ్, మల్లేష్, ప్రసన్న, సైదులు, యాదగిరి, శైలజ పాల్గొన్నారు.
సర్వీస్ రూల్స్ అమలుచేయాలి
భానుపురి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : విద్యుత శాఖలో ఆర్టిజన్లకు సర్వీసు రూల్స్ అమలు చేయాలని టీవీఏసీ జేఏసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కోచైర్మన కొండ నకులుడు, సూర్యాపేట డివిజన చైర్మన గణే్‌షబాబు, కన్వీనర్ తిరుపతయ్య అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ విద్యుత సర్కిల్ కార్యాలయం వద్ద విద్యుత ఆర్టిజన్లు వంటా వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఆర్టిజన్లకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. వంట వార్పు కార్యక్రమానికి 1104, 327, టీఆర్‌వీకేఎస్, సీఐటీయూ, ఎస్సీ,ఎస్టీ,బీసీ ఓసీఇంజనీర్స్ అసోసియేషన, పవర్ డిప్లమా అసోసియేషన్స మద్దతు తెలిపాయి. కార్యక్రమంలో నాయకులు ఉడుముల నర్సింహాచారి, పబ్బు మల్లయ్య నాగమణి, దీప్తి, శ్రీధర్‌రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.