అన్నదాత గోస పట్టదాయే
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:29 PM
ప్రకృతి వైపరీత్యాలతో ఎప్పుడు ఏ జరుగుతుందో తెలియని కాలం ఇది.. విత్తనం నాటిన నాటి నుంచి చేను పెరిగి గింజ చేతికొచ్చేది కష్టమైన రోజులివి.. పెరిగిన ఎరువుల ధరలు.. పెట్టుబడుల మోత.. ఆరుగాలం కష్టం తరువాత చేతికొచ్చే గింజ అమ్ముకుందామంటే వ్యాపారుల నిలువు దోపిడీ, కన్నీళ్లు తప్ప ఆదాయం రాక పాయే..
ధాన్యం విక్రయాల్లో అన్నీ అవస్థలే
వ్యాపారుల నిలువు దోపిడీ
సర్కారోళ్లకు కనపడకపాయే
రైతుల సమస్యలపై రచ్చబండ
ప్రకృతి వైపరీత్యాలతో ఎప్పుడు ఏ జరుగుతుందో తెలియని కాలం ఇది.. విత్తనం నాటిన నాటి నుంచి చేను పెరిగి గింజ చేతికొచ్చేది కష్టమైన రోజులివి.. పెరిగిన ఎరువుల ధరలు.. పెట్టుబడుల మోత.. ఆరుగాలం కష్టం తరువాత చేతికొచ్చే గింజ అమ్ముకుందామంటే వ్యాపారుల నిలువు దోపిడీ, కన్నీళ్లు తప్ప ఆదాయం రాక పాయే.. అందరికీ అన్నం పెట్టే రైతన్న గోస సర్కారోళ్లకి పట్టదాయే.. ఇట్లయితే బతికేదెట్టా.. ప్రస్తుత ధాన్యం కొనుగోళ్లపై ఇద్దరు రైతుల మధ్య సంభాషణ నేటి రచ్చబండ
- (ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ(వ్యవసాయం)
రామయ్య: ఏందన్నా బాగున్నవా గీ మధ్య పొలం పని లో పడిన్నట్టువ్.. శాన రోజులయింది కనిపించక..
వెంకన్న: ఏ మంచిగుంటం సెప్పు ఎవసాయం చేసేటోడు ఓడన్నా బాగుపడ్డట్టు చరిత్రలో ఉందా సెప్పు..
రామయ్య: నువు సెప్పింది నిజమేలే.. గియాల ఎవసాయంలో అన్ని కట్టాలేనాయే.. మొన్న ఆనాకాలం పంట ఏస్తే.. ఒకటే రోగాలు. గన్ని తిప్పలు పడి పైసలు మస్తుగ ఖర్సు పెట్టి మందులు కొడ్తిమి. పంట చేతికొచ్చే నాటికి గా లి ఆన వచ్చి గంత నేల మీద పడిపాయే. శానా తక్కువ పంట పండే.. గింజ దెబ్బతినే.. యాపారులు పంట బాలేద ని గన్నీ కొర్రీలే పెట్టే.. శానా తక్కువ ధరకు కొంటుర్రు.. సివరకు పెట్టుబడులు రాకపాయే..
వె ంకన్న: ఆనాకాలం గందరి పరిత్తితి గంతే గదా.. యాసంగిల ఏసిన పంటకు అన్నా.. గిట్టుబాటు ధర అస్తది అనుకున్నం.. గిపుడు జర ప్రకృతి కరుణ సూపి పంట అచ్చినా.. యాపారులు ధర పెట్టరాయే.. ఏం సేయాలే సెప్పు.
రామయ్య: యాపారులు సన్న రకం ధాన్యం కొంటున్నరని అవిసరిగా పండక పోయినా..నానాకట్టాలు పడి సాగు చేత్తి మి,చలికి ఎండకు తట్టుకోలేక పంట సరిగా రాలేదాయే.. తీ రా ధాన్యం మిల్లులకు తీసుకుపోతే.. తాలు తప్పలని అన్ని కొర్రీలే.. ఏం సేయాలే సెప్పు మొదట్ల బాగా ధర పెటి ్ట ధా న్యం అంతా అచ్చినాక క్వింటాకు రూ.24వందలే ధర పెట్టుడే కట్టమాయే.. పచ్చిగింజ అని కొన్నిటికి 2వేలు ఇచ్చిండ్రంట.
వెంకన్న: నా సంగతి ఏం చెప్పాలే సెప్పు. మంచిగ పండుతయని నాకున్న ఐదెకరాల్లో దొడ్డు రకం వరి సాగు చేసి న.. పంట ఎకరానికి 50 బత్తలు వచ్చింది. యాపారులు నేరుగా తీస్కపోతే కొన్తలేరు.. 20 రోజులాయే..ఆనకు, ఎండ కు ఆరబోసుడు రాత్రయితే కుప్పకొట్టి పట్టాలు కప్పుడు.. కళ్లాలనే తినుడు, నిద్ర పోవుడు.. ధాన్యం బాగా ఎండి శానా తరుగుపాయే.. సర్కారోళ్లు వారం కితం కేంద్రాలు ఏర్పాటు చేత్తిరి.. నాలుగు రోజులయింది కాంటా ఏసి. లారీ మిల్లు కు కాడికి పోంగనే అమ్మయ్య అనుకుని ఇంటికి అచ్చినా.. జర కంటి నిద్రపోదామని.. గంతే..
రామయ్య: అరే మంచిగ ఆరబోస్తివి.. గీ తరుగు ఎందుకు.. సెప్పు..
వెంకన్న: ధాన్యం ఎంత మంచిగున్న సరే ఆళ్లకు సంబంధం లేదు. గీ మధ్య కాలంలో కొనుగోలు కేంద్రాలకు పోయిన పతీ లారీకి తరుగు తీసినంకనే దిగుమతి చేసిండ్రని తోటి రైతులు సెప్పిండ్రు, ఏం సేత్తం శివరకు క్వింటాకు ఐదు కిలోల లెక్కన తరుగు ఇస్తంటేనే లారీ దింపిండ్రు.. శానా నట్టపోయిన.. మన బాధలు ఓరు ఇంటరు సెప్పు అన్నా..
రామయ్య: రైతులందరి పరిస్థితి గింతే ఉంది.. ఎవసాయం చేసేటోళ్లు అప్పులపాలయితున్నరు.. యాపారం చేసేటోడు మంచిగా బాగుపడుతున్నడు. గింత జరుగుతున్న సర్కారు మాత్రం పట్టన్నట్టు ఉండే..ఇంక మన బతుకులు మారవు..అన్నా..