ప్లాస్టిక్ భూతం.. చైతన్యమే లక్ష్యం
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:03 AM
ప్లాస్టిక్ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ వినూత్నంగా ప్రయత్నించారు.
సూర్యాపేటటౌన, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : ప్లాస్టిక్ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ వినూత్నంగా ప్రయత్నించారు. శుక్రవారం అంతర్జాతీయ ప్రపంచ ప్లాస్టిక్ సంచుల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో పూర్తిగా ప్లాస్టిక్ కవర్లతో తయారు చేసిన ఓ గౌనును ధరించి ప్రదర్శన ఇచ్చారు. ప్లాస్టిక్ బూతాన్ని అవగాహనతో నిర్మూలించవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నయంగా క్లాత సంచులను ఉపయోగించాలన్నారు. పశువులు సైతం ప్లాస్టిక్ కవర్లను తిని అనారోగ్యానికి గురవుతున్నాయని వివరించారు. ఆయన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.