The old ruling classes : పాత పాలకవర్గాలకే మళ్లీ బాధ్యతలు
ABN , Publish Date - May 05 , 2026 | 12:19 AM
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా ల (పీఏసీఎస్) గత పాలకవర్గాలకే తిరిగి బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు తీర్పు వెల్లడించడంతో సోమవారం పలువురు మాజీ చైర్మన్లతో పాటు ఆయా పాలకవర్గ డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు.
పీఏసీఎ్‌సలపై తీర్పు వెల్లడించిన హైకోర్టు
కోర్టు ఆదేశాలను అమలు చేసిన అధికారులు
చైర్మన్‌లుగా పలువురు బాధ్యతల స్వీకరణ
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ) : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా ల (పీఏసీఎస్) గత పాలకవర్గాలకే తిరిగి బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు తీర్పు వెల్లడించడంతో సోమవారం పలువురు మాజీ చైర్మన్లతో పాటు ఆయా పాలకవర్గ డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది ఫిబ్రవరి 14తో పీఏసీఎ్‌సలో పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రభు త్వం డిసెంబరు 19 వరకు గడువును పొడిగించింది. ఆ తరువాత ప్రభుత్వం గడువు పొడిగించకుండా 108 పీఏసీఎ్‌సలకు ప్రత్యేకాధికారుల ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీం తో ప్రాథమిక సహకార సంఘాలకు ప్రత్యేకాధికారులను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ పలు పీఏసీఎస్ మాజీ చైర్మ న్లు హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాల అనంతరం హైకోర్టులో రెండు రోజుల క్రితం తీర్పును వెల్లడించింది. తక్షణమే మాజీ చైర్మన్ల కు, ఆయా పాలకవర్గాల డైరెక్టర్లకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పాత పాలకవర్గాలకే బాధ్యత లు అప్పగిస్తూ నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల డీసీవోలు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పలువురు పీఏసీఎస్ చైర్మన్లతోపాటు పాలవర్గ డైరెక్టర్లు సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఒక్కో పీఏసీఎ్‌సలో 13 మంది డైరెక్టర్లు ఉంటారు.
డీసీసీబీ డైరెక్టర్ల పరిస్థితి ఏంటో?
హైకోర్టు ఆదేశంతో ఆయా జిల్లాల సహకార శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన మేర కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 108 సొసైటీల మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు తిరిగి బాధ్యత లు స్వీకరించే అవకాశం ఏర్పడింది. అయితే పీఏసీఎ్‌సల చైర్మన్‌ల నుంచి మొత్తం 21మంది జిల్లా సహకార బ్యాంకు కేంద్ర డైరెక్టర్లుగా ఎన్ని క కావడంతో పాటు డీసీసీబీ పాలకవర్గం రద్దు కావడంతో వారంతా మాజీలయ్యారు. హైకోర్టు ఆదేశంతో డీసీసీబీ మాజీ డైరెక్టర్లకు, మాజీ చైర్మన్‌కు కూడా తిరిగి డీసీసీబీ చైర్మన్‌గా, డైరెక్టర్లుగా బాధ్యతలు ఇవాల్సి ఉంది. అయితే గతంలో కేవలం పీఏసీఎస్ చైర్మన్లు మాత్రమే హైకోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా మాత్రమే హైకోర్టు తీర్పు వచ్చింది. తాజాగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన డీసీసీబీ పాలకవర్గంతో పాటు ఆ డీసీసీబీ చైర్మన్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుంచి మొత్తం తొమ్మిది మంది డీసీసీబీ చైర్మన్లు ఉన్నారు. వారందరికీ చైర్మన్‌లుగా అవకాశం వస్తుందా? రాదా? అనేది హైకోర్టు వెలువరించే తీర్పుపై ఆధారపడి ఉంటుంది. ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పీఏసీఎ్‌సలను డీసీసీబీ పాలకవర్గాలను నామినేటెడ్ చేయాలని యోచిస్తున్న తరుణంలో కోర్టు తీర్పుతో తిరిగి గత పాలకవర్గాలకే బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. సహకార నిబంధనల ప్రకారం పీఏసీఎస్ స్పెషల్ ఆఫీసర్లను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సహకార సంఘాల్లో ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి షేర్ క్యాపిటల్ లేనప్పుడు పీఏసీఎ్‌సలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించే అధికారం లేదనే వాదన ఉంది.