వీధి లైట్ల బిల్లుల విడుదలను నిలిపివేయాలి
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:26 AM
ఆత్మకూర్ (ఎస్) ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రామన్నగూడెం గ్రా మంలో ముగ్గురు కార్యదర్శులు తప్పుడు బిల్లులతో నిధులు డ్రా చేయడానికి యత్ని స్తున్నారని, బిల్లుల విడు దలను నిలిపివేయాలని గ్రామస్తులు బుధవారం ఎంపీడీవో హసీంకు బుధవారం ఫిర్యాదు చేశారు.
ఆత్మకూర్ (ఎస్) ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రామన్నగూడెం గ్రా మంలో ముగ్గురు కార్యదర్శులు తప్పుడు బిల్లులతో నిధులు డ్రా చేయడానికి యత్ని స్తున్నారని, బిల్లుల విడు దలను నిలిపివేయాలని గ్రామస్తులు బుధవారం ఎంపీడీవో హసీంకు బుధవారం ఫిర్యాదు చేశారు. పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత గ్రామంలో ఒక్కసారి మాత్రమే అక్కడక్కడ తాత్కాలికంగా వీధిలైట్లు వేసి రెండేళ్ల కాలంలో ముగ్గురు కార్యదర్శులు ఇనచార్జిలుగా పనిచేసి రూ. లక్షల బిల్లులు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.. ఒకసారి వీధిలైట్లు వేస్తే రెండేళ్లు గ్యారెంటీ ఉంటాయని 20 నెలల్లో మూడుసార్లు వేసినట్లు తప్పుడు బిల్లులు సృష్టించి పంచాయతీ కార్యదర్శులు గ్రామాలకు వచ్చిన అభివృద్ధి నిధులను కాజేస్తున్నారని వెంటనే వాటిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వాటిని నిలిపివేయకపోతే గ్రామస్తులంతా కలిసి ఆందోళన చేపడుతామని యూత నాయకుడు మడ్డి మల్లేశగౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.