నాణ్యమైన విద్యే సమీకృత గురుకులాల లక్ష్యం
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:34 AM
కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తోందని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని ఊట్కూరు గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డితో కలిసి సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. పాఠశాల నిర్మాణం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలం లభ్యత గురించి రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ చంద్రశేఖర్
నిడమనూరు, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తోందని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని ఊట్కూరు గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డితో కలిసి సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. పాఠశాల నిర్మాణం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలం లభ్యత గురించి రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన భూసేకరణ గురించి గ్రామస్థులతో మాట్లాడి స్థలం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రైతువేదికలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకే ప్రాంగణంలో కేజీ నుంచి పీజీ వరకు అన్ని కులాల విద్యార్థులకు సమగ్ర విద్యా సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ముఖ్య ఉద్ధేశ్యమన్నారు నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడిన్షియల్ పాఠశాలలతో విద్యా ప్రమాణాలు మరింత మెరుగవుతాయన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఈ పాఠశాలలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, ఎంపీడీవో హిమబిందు, మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, నందికొండ మట్టారెడ్డి, సర్పంచ్ కురుమేటి వసుమతి, నర్సింగు విజయ్, మెరుగు శ్రీనివాస్, నాయకులు చింతల చంద్రారెడ్డి, తుమ్మలపల్లి శేఖర్‌రెడ్డి, రాజారమే్‌షయాదవ్ పాల్గొన్నారు.
రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందించాలి
తిరుమలగిరి(సాగర్) : రైతులకు రెవెన్యూ సేవ లు పారదర్శకంగా అం దేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని కలెక్టర్ సంబఽంధిత శాఖ అధికారుల ను ఆదేశించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా ఆయన కార్యాలయంలోని భూరికార్డులు, పహాణీలు, ఆర్‌వోఆర్ ఫైళ్ల ను, మ్యుటేషన్ దరఖాస్తులను, భూభారతి నమోదు వివరాలను పరి శీలించారు. ప్రజావాణి ఫిర్యాదుల పురోగతిపై కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నాగార్జునపేటతండాకు చెందిన గిరిజన రైతులు పైల ట్ ప్రా జెక్టులో భాగంగా సర్వే నెం.12లో గల భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేసినప్పటికీ భూ సమస్య పరిష్కారానికి నోచుకోలేదని, వెంటనే సమస్యను పరిష్కరించి పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడసబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, తహసీల్దార్ అనిల్, కార్యాలయ సిబ్బంది, రైతులు తదితరులు ఉన్నారు.
వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి
నల్లగొండ రూరల్ : వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను అదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం వివిధ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చేపట్టిన వంద రోజుల కార్యచరణ ప్రణాళిక అమలులో భాగంగా చేపట్టిన పనుల్లో పురోగతి తీసుకురావాలన్నారు. రానున్న వేసవిలో మనుషులు, పశువులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడకుండా మందస్తు కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని, స్వచ్ఛంద సంస్థల ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేయించాలన్నారు. కార్యాలయ పనుల్లో సమయం వృఽథా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వినియోగించాలన్నారు. హాస్టళ్లు, తహసిల్, ఎంపీడీవో కార్యాలయాలు, సంక్షేమ శాఖలు, టీ ఫైబర్ ద్వారా ఇం టర్నెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేలా చూడాలని, తద్వారా ఉచిత సేవలతోపాటు, పనులు సులభం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, వై. అశోక్ రెడ్డి, జిల్లా అధికారులు ఉన్నారు.