Share News

ఎటూ తేలని సహకార సంఘాల భవితవ్యం!

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:05 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌) భవితవ్యం కొలిక్కి రావడం లేదు. సొసైటీల పాలకవర్గాల గడువు ముగిసిన తరువాత నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారంటూ కొందరూ పీఏసీఎస్‌ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తిరిగి వారిని చైర్మన్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఎటూ తేలని సహకార సంఘాల  భవితవ్యం!

కోర్టు ఆదేశాలతో కొనసాగుతున్న గత పాలకవర్గాలు

నామినేటెడ్‌ కమిటీలనియామకాలపై ఊగిసలాట

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 108 పీఏసీఎ్‌సలపై వీడని సందిగ్ధం

(ఆంధ్రజ్యోతి,నల్లగొండ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌) భవితవ్యం కొలిక్కి రావడం లేదు. సొసైటీల పాలకవర్గాల గడువు ముగిసిన తరువాత నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారంటూ కొందరూ పీఏసీఎస్‌ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తిరిగి వారిని చైర్మన్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పీఏసీఎ్‌సల పాలకవర్గాల గడువు ముగిసిన తరువాత కొద్ది రోజుల పాటు సీఈవోలను పర్సన్‌ ఇన్‌చార్జీలుగా ప్రభుత్వం నియమించింది.

ఆ తరువాత కోర్టు నిర్ణయం మేరకు పర్సనల్‌ ఇన్‌చార్జీల స్థానంలో తిరి గి పాత పాలకవర్గాలకే బాధ్యతలు అప్పగించిం ది. అయితే తరచూ రద్దు కావడం, తిరిగి పాలకవర్గాలకు బాధ్యతలు ఇవ్వడంతో పాలనాపర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పీఏసీఎ్‌సలకు ఎన్నికలకు బదులు మార్కెటింగ్‌ కమిటీల మాదిరిగానే ఒక చైర్మన్‌ను 12మంది డైరెక్టర్లను నియమించాలని ప్రభుత్వం యో చించింది. అందుకు అనుగుణం గా నిర్ణయం తీసుకునే ముందు సాంకేతిక కారణాలతో మళ్లీ ఆ ప్రక్రియ నిలిచింది. కోర్టు ఆదేశాలతో పీఏసీఎ ్‌సల పాలకవర్గాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆర్డినెన్స్‌ ప్రకారం సొసైటీలకు నామినేటెడ్‌ పద్ధతిన కమిటీలను నియమించడంలో ఊగిసలాట కొనసాగుతోంది.

ఇతర జిల్లాల్లో పలు సొసైటీలకు కమిటీలు

వరంగల్‌, కరీంనగర్‌, వికారాబాద్‌ జిల్లాలో మొత్తంగా 14 పీఏసీఎ్‌సలకు కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలు ఆరు నెలలు లేదా ఆయా సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 108 సొసైటీల పరిస్థితి ఏమిటనేది అయోమయంగా ఉంది. సొసైటీలకు నామినేటెడ్‌ పద్ధతిన కమిటీలు నియమించాలా? లేక ఎన్నికలు నిర్వహించాలా? అనే సందిగ్ధంలో ప్రభుత్వం ఉంది. పీఏసీఎ్‌సల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసిన సమయంలో పాలకవర్గ స్థానంలో అధికారులతో కూడిన పర్సనల్‌ ఇన్‌చార్జీలను ప్రభుత్వం నియమించింది. తిరిగి కోర్టు ఆదేశాలతో బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గాలను రద్దు చేయాలంటే సాంకేతిక సమస్యలు అడ్డువస్తున్నాయి. దీంతో నామినేటెడ్‌ కమిటీలను నియమించాలని విన్నపాలు రావడంతో కమిటీల ఏర్పాటుకే ఏప్రిల్‌ నెలలో మంత్రివర్గం సమావేశం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఆయా పీఏసీఎ్‌సలలో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు కూడా తీసుకన్నా, నియమాకాల్లో జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలోని మూడు జిల్లాలో డిఫాల్ట్‌ సొసైటీలను రద్దు చేసి నామినెటేడ్‌ కమిటీల ఏర్పాటుకు అవకాశం కల్పించగా, ప్రస్తుతం సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో నామినెటేడ్‌ కమిటీల ఏర్పాటుకు ఏ మేరకు అవకాశాలు ఉన్నాయనే దానిపై అధ్యయనం చేస్తుండటంతో కాలయాపన జరుగుతోంది. దీంతో సొసైటీల్లో పాలనపర సమస్యలు ఎదురవుతున్నాయి.

డీసీసీబీలో డైరెక్టర్లు, చైర్మన్లు లేని పరిస్థితి

సహకార సంఘాలకు నామినెటేడ్‌ కమిటీ ల ఏర్పాటు అనంతరం డీసీసీబీ డైరెక్టర్లు, చైర్మన్‌ను సైతం నామినెటేడ్‌ విధానంలో నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పీఏసీఎ్‌సలో విచిత్ర పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు పీఏసీఎ్‌సలకు గత పాలకవర్గాలు కొనసాగుతుండగా జిల్లా సహకార బ్యాంకు(డీసీసీబీ)లో డైరెక్టర్లు, చైర్మన్లు లేని అనిశ్చిత పరిస్థితి నెలకొంది. పీఏసీఎ్‌సల పాలకవర్గాలను కొనసాగిస్తున్న ప్రభుత్వం డీసీసీబీలో మాత్రం డైరెక్టర్లు, చైర్మన్లను కొనసాగించడం లేదు. జిల్లా కలెక్టర్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా ప్రస్తుతం డీసీసీబీకి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం లో గందరగోళంలో ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే చర్చ సాగుతోంది. పీఏసీఎ ్‌సల పాలకవర్గాలు కొనసాగుతున్నా వాటికి పూర్తిస్థాయి అధికారాలు లేకపోవడం, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు పాలకవర్గం లేకపోవడంతో పాలనపర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. డీసీసీబీకి 21మంది డైరెక్టర్లు, చైర్మన్‌ బాధ్యతల్లో ఉన్న సమయంలో మహాజన సభతో పాటు ఎంసీ మీటింగ్‌ నిర్వహించి తీర్మానాలు చేసేవారు. ప్రస్తుతం సహకార వ్య వస్థలో ఏర్పడిన సందిగ్ధం కారణంగా అయోమయం నెలకొంది. ఇదిలా ఉంటే ఈనెల 14వ తేదీలోగా కొంత మేరకు సహకార సం ఘాలకు నామినెటేడ్‌ కమిటీల ఏర్పాటుపై నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Updated Date - Jul 04 , 2026 | 12:05 AM