Share News

అన్నిరంగాల్లోనూ భవిష్యత డ్రోనటెక్నాలజీదే

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:31 AM

భవిష్యతలో అన్నిరంగాల్లో డ్రోన టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందని గుంటూరు విజ్ఞాన్స యూనివర్సిటీ ప్రొఫెసర్‌, రీసోర్స్‌పర్సన ఎన.ఉషారాణి అన్నారు.

అన్నిరంగాల్లోనూ భవిష్యత డ్రోనటెక్నాలజీదే
డ్రోన టెక్నాలజీ వర్క్‌షాప్‌లో గుంటూరు విజ్ఞాన్స యూనివర్సిటీ ప్రొఫెసర్‌, రీసోర్స్‌ పర్సన ఉషారాణి, దేశముఖి విజ్ఞాన్స డైరెక్టర్‌ వైవీ దాసేశ్వర్‌రావు

గుంటూరు విజ్ఞాన్స యూనివర్సిటీ ప్రొఫెసర్‌, రీసోర్స్‌ పర్సన ఎన ఉషారాణి

భూదానపోచంపల్లి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : భవిష్యతలో అన్నిరంగాల్లో డ్రోన టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందని గుంటూరు విజ్ఞాన్స యూనివర్సిటీ ప్రొఫెసర్‌, రీసోర్స్‌పర్సన ఎన.ఉషారాణి అన్నారు. విద్యార్థులు ఈ ఆధునిక సాంకేతికతను నేర్చుకోవడం ద్వారా మంచి కెరీర్‌ అవకాశాలు పొందవచ్చునని తెలిపారు. యాదాద్రి-భువనగిరి జిల్లా భూదానపోచంపల్లి మం డలం దేశముఖి విజ్ఞాన్స యూనివర్సిటీలో ‘డ్రోన టెక్నాలజీ : డిజైన, ఆపరేషన’, రియల్‌ టైమ్‌ అప్లికేషన్స’ అనే అంశంపై నిర్వహించిన మూడు రోజుల ప్రత్యేక వర్క్‌షాప్‌ గురువారం ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. డ్రోన టెక్నాలజీ కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, వ్యవసాయం, వైద్యం, రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోందన్నారు. ఈ సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు విద్యార్థులు నాంది పలకాలన్నారు. క్యాంప్‌సలో ‘డ్రోన టెక్నాలజీ క్లబ్‌’ను అధికారికంగా ప్రారంభించారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు సీ-డాక్‌ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆమె ప్రకటించారు. దీంతో అత్యాధునిక పరిశోధనలు చేసే అవకాశం దక్కుతుందన్నారు.

డ్రోన టెక్నాలజీతో అపార అవకాశాలు

ప్రస్తుతం ‘డ్రోన టెక్నాలజీ’ అనేది ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఒక అపారమైన అవకాశాల గని అని విజ్ఞాన్స యూనివర్సిటీ దేశముఖి డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ వైవీ దాసేశ్వర్‌రావు అన్నారు. భవిష్యతలో ప్రతి రంగంలోనూ డ్రోనల వినియోగం తప్పనిసరి కాబోతుందన్నారు. ఈ కీలక మార్పును గుర్తించే విజ్ఞాన్స యూనివర్సిటీలో పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ‘డ్రోన టెక్నాలజీ క్లబ్‌’ ఏర్పాటు చేశామన్నారు. సీ డాక్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఒప్పందం ద్వారా విద్యార్థులు అత్యాధునిక సాంకేతికతపై ప్రయోగాత్మక శిక్షణ పొందేఅవకాశం లభిస్తుందన్నారు. వర్క్‌షా్‌పలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

వర్క్‌షా్‌పలో తొలిరోజు డ్రోనల ప్రాథమిక సూత్రాలు, యూఏవీ సిస్టమ్స్‌పై ప్రొఫెసర్‌ ఎన ఉషారాణి, డాక్టర్‌ పీ వెంకటసుబ్బారావు అవగాహన కల్పించారు. రెండో రోజు ఫ్లైట్‌ కంట్రోలర్లు, సెన్సార్లు, కమ్యూనికేషన సిస్టమ్‌తో పాటు డ్రోన అసెంబ్లీపై ప్రాక్టికల్‌ శిక్షణ ఇచ్చి ఫ్లయింగ్‌ సెషన నిర్వహించారు. మూడో రోజున డ్రోన ప్రోగ్రామింగ్‌, డీజీసీఏ నిబంధనలు, అడ్వాన్సడ్‌ ఫ్లైట్‌ ట్రైనింగ్‌తో కార్యక్రమం ముగిసింది.

Updated Date - Apr 10 , 2026 | 12:32 AM