Share News

ఉపాధి పథకాన్ని పటిష్ఠంగా అమలుచేయాలి

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:46 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి న వీబీజీ-రాంజీ ఉపాధిహామీ పథకాన్ని జిల్లాలో పూర్తిస్థాయిలో పటిష్టంగా అమలుచేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ సభ్యు లు సంజయ్‌కుమార్‌, కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌పవార్‌ అన్నారు.

ఉపాధి పథకాన్ని పటిష్ఠంగా అమలుచేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌పవార్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి న వీబీజీ-రాంజీ ఉపాధిహామీ పథకాన్ని జిల్లాలో పూర్తిస్థాయిలో పటిష్టంగా అమలుచేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ సభ్యు లు సంజయ్‌కుమార్‌, కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌పవార్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఉపాధిహామీ పనుల వివరాలను మీద కేంద్ర బృందానికి పవర్‌పాయిం ట్‌ ప్రజెంటేషన ద్వారా వివరించారు. అనంత రం ఈజీఎష్‌ పథకాల పనులపై జిల్లా గ్రామీ ణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన ప్రదర్శనను కేంద్ర బృందం, కలెక్టర్‌ తిలకించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సీతారామారావు, డిప్యూటీ సీఈవో శిరీష, కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:46 AM