Share News

నెరవేరుతున్న పేదల సొంతింటి కల

ABN , Publish Date - May 07 , 2026 | 11:59 PM

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతున్నదని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగిరిలోని 24వ వార్డులో గురువారం ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం లో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పట్టు వస్త్రాలను కానుకగా అందజేసి అభినందించి మాట్లాడారు.

నెరవేరుతున్న పేదల సొంతింటి కల

భువనగిరి టౌన్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతున్నదని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగిరిలోని 24వ వార్డులో గురువారం ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం లో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పట్టు వస్త్రాలను కానుకగా అందజేసి అభినందించి మాట్లాడారు. అర్హులందరికీ సొంతిల్లు అందివ్వడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈమేరకు భువనగిరి పట్టణంలో ఇంటి స్థలంతో పాటు రూ.5లక్షల ఇందిరమ్మ పథకం వర్తింపచేస్తామని అన్నారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్‌, వైస్‌చైర్మన్‌ పోతం శెట్టి మంజుల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు చల్లగురుగుల కృష్ణవేణి రఘుబాబు, జాలిగం విఘ్నేష్‌ తదితరులు పాల్గొన్నారు.

జాబ్‌ మేళాకు ఏర్పాట్లు పూర్తి

కుంభం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న మెగా జాబ్‌ మేళా శుక్రవారం ప్రారంభం కానుంది. స్థానిక న్యూ డైమెన్షన్‌ హైస్కూల్‌లో 8, 9 తేదీల్లో స్క్రీనింగ్‌, టోకెన్‌ అలాట్‌మెంట్‌, 10న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఫౌండేషన్‌ చైర్మన్‌ కుంభం కీర్తిరెడ్డి తదితర నాయకులు పరిశీలించారు. జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు.

Updated Date - May 08 , 2026 | 08:29 AM