Share News

దోమల మోత

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:23 AM

జిల్లాలో దోమలు విజృంభిస్తున్నాయి. సాధారణంగా చలికాలంలో దోమల మోత ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుత సీజన్‌లో సాయంత్రం తలుపు తెరిస్తే చాలు దోమలు ఇంటి నిండా చేరుతున్నాయి. ఇటీవల గడ్డి దోమలు ఎక్కువయ్యాయి. దోమల కారణంగా డెంగీ, మలేరి యా, టైఫాయిడ్‌ జ్వరాలతో ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు.

దోమల మోత

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఫాగింగ్‌

మురుగు కాల్వల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం

(ఆంధ్రజ్యోతి, సూర్యాపేట): జిల్లాలో దోమలు విజృంభిస్తున్నాయి. సాధారణంగా చలికాలంలో దోమల మోత ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుత సీజన్‌లో సాయంత్రం తలుపు తెరిస్తే చాలు దోమలు ఇంటి నిండా చేరుతున్నాయి. ఇటీవల గడ్డి దోమలు ఎక్కువయ్యాయి. దోమల కారణంగా డెంగీ, మలేరి యా, టైఫాయిడ్‌ జ్వరాలతో ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు.

జిల్లాలోని మురుగు కాల్వల్లో చెత్తాచెదారం చేరి నీరు నిల్వ ఉండి దోమలు పెరుగుతున్నా యి. అత్యధికంగా మునిసిపాలిటీల్లోని శివారు ప్రాంతాల్లో ఈ బెడద ఉంది. సూర్యాపేటలో సుమారు 30వేలఇళ్లు,44 మురికి వాడలు ఉన్నాయి. పట్టణంలో గ్రామాల విలీనంతో జనా భా 1.50లక్ష వరకు పెరిగింది. ప్రధానంగా పట్టణంలోని ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు అధికంగా ఉన్నా యి. అక్కడ వర్షపు నీరు, మురు గు నీరు నిలిచి, అవి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి.

రూ.లక్షలు ఖర్చు చేసినా

పట్టణాల్లోని రోడ్లను ఊడ్చేందుకు, మురుగు కాల్వల్లో పూడిక తీసేందుకు మునిసిపల్‌ రెగ్యులర్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది పని చేస్తున్నా రు. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి, నేరేడుచర్లతో పాటు పలు మండల కేంద్రాల్లో మురుగుకాల్వలను శుభ్రం చేసేందుకు పారిశుఽధ్య సిబ్బంది ఉన్నారు. అయి నా పారిశుధ్య పనులు సరిగా సాగడం లేదు. సూర్యాపేట మెయిన్‌ రోడ్డు, వాణిజ్య భవన్‌, ఈద్గా రోడ్డులోని దుకాణాలకు వెళ్తే దుర్గంధం వెదజల్లుతోంది. దుకాణాలు ఉండే బజారులో రోజూ మురుగు కాల్వల పూడిక తీసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, పారిశుధ్య సిబ్బం ది సంఖ్య పెంచి పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాల ని ప్రజలు కోరుతున్నారు. ఏటా దోమల నివారణకు ఫాగింగ్‌, కాల్వల్లో మందులు పిచికారీ చేస్తున్నారు. పట్టణంలో ఏటా రూ.3లక్షల వరకు అందుకు వ్యయం అవుతోంది. పారిశుధ్య సిబ్బంది వేతనాలకు నెలకు రూ.20లక్షల నుంచి రూ.30లక్షల వరకు మునిసిపాలిటీ వ్యయం చేస్తోంది. ఇంత ఖర్చు చేసినా దోమల మోత మాత్రం తగ్గడంలేదు.

సుమారు రూ.2కోట్లకు పైగా ఖర్చు

జిల్లాలో దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు పట్టణాల్లోని కుటుంబాలు నెలనెలా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీ ఇంటిలో నెలకు దోమల నివారణకు సుమారు రూ.100 నుంచి రూ.200వరకు ఖర్చు చేస్తున్నారు. మస్కిటో కాయిల్స్‌, లిక్విడ్స్‌ వినియోగిస్తున్నారు. కొంత మంది రాత్రి పూట బ్యాట్‌ పట్టుకొని దోమలను చంపేందుకు యుద్ధం చేస్తున్నారు. ఫాగింగ్‌ చల్లే పొగకు కూడా దోమలు అలవాటు పడినట్లు తెలుస్తోంది. వీధుల్లో ఫాగింగ్‌ చేస్తున్నా, ఇళ్లలోకి దోమలు చేరుతున్నాయి. దీంతో ఉపయోగం లేకుండాపోతోంది. జిల్లా వ్యాప్తంగా దోమల నివారణ కోసం నెలకు సుమారు రూ.2కోట్లకు పైగా ఖర్చు అవుతోంది.

దోమలతో నిద్ర పట్టడం లేదు : బొజ్జ పరుశరాం, సూర్యాపేట

దోమలతో నిద్ర పట్టడంలేదు. సాయంత్రం తలుపు తీయాలం టే భయం వేస్తోంది. బాత్‌రూమ్‌ లు, మరుగుదొడ్లలో విపరీతంగా దోమలు చేరుతున్నాయి. దోమలు కుట్టడంతో పెద్ద బెందులు వస్తున్నాయి. అంతేగాక జ్వరాలు కూడా వస్తున్నా యి. అధికారులు దోమల నివారణకు పాటుపడాలి.

దోమల నివారణకు కృషి : సీహెచ్‌.హన్మంతరెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌

దోమల నివారణకు కృషి చేస్తున్నాం. ప్రతీ రోజు ఉదయం మురుగు కాల్వల్లో బైటెక్స్‌ మందులు పిచికారీ చేస్తున్నాం. సాయంత్రం వేళల్లో ఫాగింగ్‌ చేస్తున్నాం. అన్ని వార్డుల్లో దశల వారీగా ఫాగింగ్‌ చేస్తాం. ప్రజలు ఇళ్లలో వినియోగంలోని వస్తువులను తీసివేయాలి. ఇళ్ల మధ్యలో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.

దోమలతో అనేక వ్యాధులు : పెండెం వెంకటరమణ, డీఎంహెచ్‌వో

దోమల కారణంగా ప్రజలు జబ్బున పడుతున్నారు. దోమలు కుడితే మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ జ్వరాలు వస్తాయి. ఇళ్లల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే దోమలకు ఆవాసాలుగా మారుతాయి. ఉపయోగంలో లేని టైర్లలో, ఎయిర్‌ కూలర్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.

Updated Date - Nov 07 , 2026 | 12:23 AM