హమ్మయ్య..ఒకటినే వేతనాలొచ్చాయ్
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:15 AM
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు అందాయి. దీంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఉద్యోగులకు గత ప్రభుత్వంలో 10వ తేదీ తర్వాతనే వచ్చేవి. దీంతో ఉద్యోగులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
గత ప్రభుత్వంలో 10వ తేదీ తర్వాతనే..
హోంగార్డులు, అంగనవాడీలతో పాటు మరికొందరికి అందని వైనం
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్)
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు అందాయి. దీంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఉద్యోగులకు గత ప్రభుత్వంలో 10వ తేదీ తర్వాతనే వచ్చేవి. దీంతో ఉద్యోగులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు ఖచ్చితంగా అందాలని సీఎం రేవంతరెడ్డి జూన 9న ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఒకటో తేదీన వేతనాలు అందించాలని ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఆయా శాఖలకు చెందిన అధికారులు 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు అందేలా చర్యలు చేపట్టడంతో ఉద్యోగుల బ్యాం కు ఖాతాలో వేతనాల డబ్బులు జమయ్యాయి.
జిల్లాలో 8వేల మందికిపైగా...
జిల్లాలో వివిధ శాఖల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిపి 8 వేల మందికి పైగా ఉన్నారు. అదేవిధంగా పెన్షనర్లు 5,800 మంది ఉన్నారు. వీరితో పాటు పోలీసులు 1000, ఉపాధ్యాయులు 5 వేల మంది ఉన్నారు. దీంతో ఉద్యోగుల హాజరును గడిచిన నెల 21వ తేదీ నుంచి కొనసాగుతున్న నెల 20వ తేదీ వరకు లెక్కించి సంబంధిత వేతనాల బిల్లులను 25వ తేదీలోపు ట్రెజరీ కార్యాలయాలకు పంపించారు. దీంతో ట్రెజరీ కార్యాలయాల నుంచి ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు వేతన డబ్బులు జమయ్యాయి. ఇప్పటివరకు పలు శాఖల ఉద్యోగులకు మాత్రం 1వ తేదీన వేతనాలు వస్తున్నా చాలా శాఖల ఉద్యోగులకు 5వ తేదీన వస్తున్నాయి. ఈ విషయంలో సీఎం రేవంతరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో వేతనాలు ఒకటో తేదీన అందాయి.
గతంలో ఆలస్యం
ఉద్యోగులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 10వ తేదీ తర్వాతనే వేతనాలు అందేవి. దీంతో ఉద్యోగులు ఎన్నో రకాలుగా ఇబ్బందులుపడేవారు. ఉద్యోగులకు వేతనాలు రాకపోవడంతో వారి కుటుంబాల పోషణ ఇబ్బందిగా మారేది. ఇళ్ల అద్దెలు, వివిధ రకాల రుణాలకు సంబంధించిన ఈఎంఐలు చెల్లించలేకపోయేవారు. కొంతమంది ఇతరుల నుంచి అప్పులు తీసుకుని వేతనాలు వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేవారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇంకా ఆలస్యంగా వేతనాలు వచ్చేవి. అంతేకాకుండా నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉండేవి.
కొందరి రాని వేతనాలు
జిల్లాలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు వచ్చాయి. కానీ పోలీ్‌సశాఖలో పనిచేస్తున్న హోంగార్డులు, అంగనవాడీలతో పాటు పలు శాఖలకు చెందిన కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం వేతనాలు రాలేదు. వారికి సంబంధించి హాజరు వివరాలను పంపించినా బడ్జెట్ కారణంగా వేతనాలు అందలేదని సమాచారం.
1వ తేదీనే వేతనాలు అందడం సంతోషకరం
ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు రావడం ఎంతో సంతోషదాయకం. 1వ తేదీనే వేతనాలు అందడంతో ఉద్యోగులు వారి ఈఎంఐలను సకాలంలో చెల్లించనున్నారు. దీంతో ఉద్యోగుల సిబిల్ స్కోర్‌కు ఇబ్బందులు కలగవు. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించేలా ఆదేశాలు ఇచ్చిన సీఎం రేవంతరెడ్డికి ధన్యవాదాలు. ఉద్యోగుల సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలి.
దున్న శ్యామ్, టీఎనజీవో్‌స జిల్లా కార్యదర్శి సూర్యాపేట