ఉపాధ్యాయుల సర్దుబాటు
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:25 AM
జిల్లాలో విద్యాశాఖ ప్రక్షాళనలో భాగంగా కలెక్టర్ తేజ్‌సనందలాల్‌పవార్ ఉపాధ్యాయుల సర్దుబాటుకు పూనుకున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి పలువురు ఉపాధ్యాయులను బదిలీ చేశారు.
జిల్లాలో 191 మంది బదిలీ
పరిమితికి మించి ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల గుర్తింపు
అక్కడి నుంచి అవసరాలున్న పాఠశాలలకు...
ఎక్కువగా ఉన్నత పాఠ శాలలకు కేటాయింపు
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్): జిల్లాలో విద్యాశాఖ ప్రక్షాళనలో భాగంగా కలెక్టర్ తేజ్‌సనందలాల్‌పవార్ ఉపాధ్యాయుల సర్దుబాటుకు పూనుకున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి పలువురు ఉపాధ్యాయులను బదిలీ చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేపట్టారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు లేక వెనకబడిన ఉన్నత పాఠశాలలకు ఉపాధ్యాయులను బదిలీ చేశారు. దీంతో విద్యార్థులకు మెరుగైన బోధన అందడంతో ఉత్తమ ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై కలెక్టర్ తేజ్‌సనందలాల్‌పవార్ దృష్టి సారించారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగతులు పూర్తి చేశారు. విద్యార్థులు అన్ని సబ్జెక్ట్‌ల్లో మంచిఫలితాలు సాధించేందుకు ఎప్పటికప్పుడు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి ఆధారంగా వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేకదృష్టి పెట్టేలా ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్నారు. అయితే విద్యార్థులు ఉన్న చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తో ంది. ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు తక్కువగా ఉండటాన్ని క్షేత్రస్థాయి పర్యటనలో గమనించిన కలెక్టర్ ఉపాధ్యాయుల సర్దుబాటుకు సమగ్రవివరాలు సేకరించారు. అందులో భాగంగా 191మంది ఉపాధ్యాయులను సర్దుబాటు పేరిట బదిలీచేశారు. వారు త్వరలో వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరాల్సి ఉంది. ఎక్కువగా జడ్పీహెచ్‌ఎ్‌స, ప్రాథమిక పాఠశాలలకు బదిలీ చేశారు. ఈ విషయంలో పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
అవసరాలను ముందే గుర్తించి...
జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో విద్యాశాధికారులు జాగ్రత్తలు పాటించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉండాల్సిన వారి కంటే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించా రు. ఒక పాఠశాలలో ఒక సబ్జెక్ట్ బోధించేందుకు ఒక ఉపాధ్యాయుడు అవసరం ఉన్న చోట ఇద్దరు, ముగ్గురే సి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. చివ్వెంల మండలకేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా ర్థు సంఖ్యతో పోలిస్తే అవసరానికి మించి ఉపాధ్యాయు లు ఉన్నారు. ప్రతీ ఉన్నత పాఠశాలలో 250 మంది విద్యార్థుల వరకు ఉంటే ఒక్కో సబ్జెక్ట్ బోధించేందుకు ఒక ఉపాధ్యాయుడు అవసరం. ఆపైన విద్యార్థు లు ఉంటే ఇద్దరేసి చొప్పున ఉండాలి. కాగా జిల్లాలో నూతనకల్, తిరుమలగిరి, అర్వపల్లి, కోదాడ పట్టణం, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మండల కేంద్రాల్లోని ఉన్నత పాఠశాలలతో పాటు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలల్లో మాత్రమే 250 కి పైగా విద్యార్థులు ఉన్నారు. కానీ చాలా పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నా ఉండాల్సిన దానికంటే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. దీంతో వారిని ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు బదిలీచేశారు. సం బంధిత పాఠశాలల్లో సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయులు ఇద్దరు ఉంటే అందులో జూనియర్ ఉపాధ్యాయుడిని అక్కడి నుంచి అదే మండలంలోని పాఠశాల లేకపోతే డివిజన్‌లో కాకపోతే జిల్లాలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి సర్దుబాటు పేరిట బదిలీ చేశారు.
ఎక్కువగా తెలుగు, ఇంగ్లీష్, సాంఘికశాస్త్రం
జిల్లాలో 191మంది ఉపాధ్యాయులను సర్దుబాటు పేరిట బదిలీచేశారు. అందులో ఎక్కువగా తెలుగు, ఇంగ్లీష్, సాంఘిక శాస్త్రం బోధించే స్కూల్‌అసిస్టెంట్లు ఉన్నారు. వారితో పాటు ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు అవసరమైన ఎస్జీటీలను బదిలీచేశారు. బదిలీ అయిన ఉపాధ్యాయులు త్వరలో వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరాల్సి ఉంది. జిల్లాలో విధుల సర్దుబాటు పేరిట చేపట్టిన బదిలీలను పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మెరుగైన విద్యాబోధన అందించేందుకు బదిలీలు : తేజ్‌సనందలాల్‌పవార్, కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సబ్జెక్టుల్లో మెరుగైన విద్యాబోధనకు ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాం. పలు పాఠశాలల్లో విద్యార్థులు ఉన్నా అక్కడ ఉపాధ్యాయుల కొరత ఉంది. దీంతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలను గుర్తించి అక్కడి వారిని సర్దుబాటు చేశాం. నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నాం. విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఏఐ తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థులను తల్లిదండ్రులు చేర్పించాలి. ఉపాధ్యాయులు విద్యార్థ విద్యాభివృద్ధికి కృషి చేయాలి.