సూర్యా : 43.3 డిగ్రీలు
ABN , Publish Date - Apr 15 , 2026 | 11:28 PM
ఏప్రిల్ రెండో వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. బుధవారం గరిడే పల్లి మండలం కీతవారిగూడెంలో 43.3 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది. అదేవిధంగా జిల్లాలోని 23 మండలాలకు సగం మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగత్ర నమోదైంది.
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట టౌన)
ఏప్రిల్ రెండో వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. బుధవారం గరిడే పల్లి మండలం కీతవారిగూడెంలో 43.3 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది. అదేవిధంగా జిల్లాలోని 23 మండలాలకు సగం మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగత్ర నమోదైంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటలు దాటిందంటే ఎండ తీవ్రత ఎక్కువవుతోంది. రాత్రి 10 గంటల దాకా వడగాడ్పులు తగ్గడం లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
రహదారులపై తోపుడు బండ్లు, కూరగాయలు, పండ్లు విక్రయించే వారి ఇబ్బందులు మరింత ఎక్కువ. గొడుగుల కింద కూర్చునా భరించలేని రహదారి వేడితో ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావడంలేదు. వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే ప్రజలు వేడి నుంచి ఉపాశమనం కోసం శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు నిత్యం వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో కొబ్బరిబొండాలు, నిమ్మరసాలు, పళ్లరసాలను సేవిస్తున్నారు. అదేవిధంగా జిల్లాకేంద్రమైన సూర్యాపేటలో ప్రజలు అవసరం ఉంటేనే బయటకు వస్తున్నారు. మధ్యాహ్నం రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లాకేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే ఎంజీరోడ్డు, పాత బస్టాండ్ ప్రాంతం, వాణిజ్యభవన సెంటర్, శంకర్‌విలా్‌ససెంటర్‌లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది ఏర్పాటు చేసిన చలివేంద్రాలు బాటసారుల దాహార్తిని తీర్చుతున్నాయి. అదేవిధంగా ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడుతున్నారు. దీంతో విద్యుత మీటర్ గిర్రున తిరుగుతోంది. వేసవి మరో 40 రోజులు ఉండటంతో ఎలా గడపాలో అంటూ భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మే నెలలో ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయోనని చర్చించుకుంటున్నారు.
బాబోయ్ ఎండలు.....
పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు చిన్న పిల్లలు, వృద్ధులు తల్లడిల్లిపోతున్నారు. వారం రోజులుగా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో బుధవారం అత్యధికంగా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో 43.3 డిగ్రీలు, అత్యల్పంగా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో 39 డిగ్రీలు నమోదైంది. పొద్దుపోయాక కూడా వడగాడ్పులతో కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలుగా నమోదయ్యాయి. గరిడేపల్లి మండలంలో ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. మండలంలో వైద్య సిబ్బంది ఎండ తీవ్రతతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఏదైనా అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.
బయటకు వెళితే రక్షణ చర్యలు తీసుకోవాలి
ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు ఎండ నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలి. టోపీలు, రుమాలు, చల్లని కళ్లద్దాలు ధరించాలి. అవసరమైతే తప్ప బయటకు రావద్దు. వడదెబ్బకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలోల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాం.
పెండెం వెంకటరమణ, డీఎంహెచవో
మండలం గ్రామం ఉష్ణోగ్రత
గరిడేపల్లి కీతవారిగూడెం 43.3
చిలుకూరు చిలుకూరు 43.0
గరిడేపల్లి గరిడేపల్లి 42.8
మేళ్లచెర్వు మేళ్లచెర్వు 42.7
నూతనకల్ నూతనకల్ 42,5
హుజూర్‌నగర్ లక్కవరం 42.4
మద్దిరాల ముకుందాపురం 42.0
చింతలపాలెం దొండపాడు 42.0
చివ్వెంల తిరుమలగిరి 41.6
అనంతగిరి శాంతినగర్ 41.5
మఠంపల్లి పెదవీడు 41,1