జంతువులకు సర్జికల్ స్టాప్లర్ పిన్స్
ABN , Publish Date - Apr 15 , 2026 | 11:42 PM
కోదాడ రూరల్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతీ య పశువైద్యశాలలో గేదె అరల పొట్టకు నిర్వహించిన శస్త్ర చికిత్సలో చర్మానికి జంతువుల్లో తొలిసారిగా సర్జికల్ స్టాప్లర్ పిన్నులను వినియోగించినట్లు అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య తెలిపారు.
కోదాడ రూరల్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతీ య పశువైద్యశాలలో గేదె అరల పొట్టకు నిర్వహించిన శస్త్ర చికిత్సలో చర్మానికి జంతువుల్లో తొలిసారిగా సర్జికల్ స్టాప్లర్ పిన్నులను వినియోగించినట్లు అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య తెలిపారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలకేంద్రానికి చెందిన ఓ రైతు పాడిగేదె 45 రోజులుగా అజీర్తితో బాధపడుతుండగా బుధవారం పశువైద్యశాలకు తీసుకెళ్లాడు. పొట్ట శస్త్రచికిత్స ద్వారా పొట్టలోని గ్యాస్‌పట్టిన కసరు తొలగించి, పొట్ట శుభ్రపరిచి, ఆపరేషన్ గాయాన్ని మూసివేయడానికి చర్మానికి ఈ సర్జికల్ స్టాప్లర్ పిన్స్ వేసినట్లు చెప్పారు. సాధారణంగా 15 నుంచి 20 నిమిషాలు పట్టే ఈ కుట్ల సమయం పిన్నులతో అర నిమిషంలో పూర్తవ్వడంతో సమయం ఆదాతో పాటు పశువుకి బాధ, మత్తు ఔషధాలను తగ్గించగలిగామన్నారు. వైద్యులకు గాయాలయ్యే అవకాశమే లేదని అన్నారు. ఇన్ని మంచి లాభాలు ఉన్న ఈ పిన్నులనే ఇక నుంచి శస్త్ర చికిత్సల్లో వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ఈ శస్త్ర చికిత్సలో సిబ్బంది చంద్రకళ, కర్ణ పాల్గొన్నారు.