కిలో చికెన్ రూ.340
ABN , Publish Date - May 13 , 2026 | 12:18 AM
ఎండల తీవ్రత కారణంగా చికెన్ ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. నాలుగైదు రోజుల క్రితం వరకు సామాన్యుడికి సైతం అందుబాటులో ఉన్న చికెన్ ధరలు ఒక్కసారిగా రెట్టింపైంది. కిలో రూ.190 నుంచి రూ.210 పలికిన ధర ఏకంగా రూ.320 నుంచి రూ.340 వరకు ఎగబాకింది.దీంతో సామాన్యుడికి చికెన్ తినడం అనేది విందుభోజనంగా మారింది.
కిలో చికెన్ రూ.340
ఎండల తీవ్రతకు బ్రాయిలర్ కోళ్ల మృత్యువాత
తగ్గిన చికెన్ సరఫరా
ఒక్కసారిగా పెరిగిన ధరలు
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ) : ఎండల తీవ్రత కారణంగా చికెన్ ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. నాలుగైదు రోజుల క్రితం వరకు సామాన్యుడికి సైతం అందుబాటులో ఉన్న చికెన్ ధరలు ఒక్కసారిగా రెట్టింపైంది. కిలో రూ.190 నుంచి రూ.210 పలికిన ధర ఏకంగా రూ.320 నుంచి రూ.340 వరకు ఎగబాకింది.దీంతో సామాన్యుడికి చికెన్ తినడం అనేది విందుభోజనంగా మారింది. సోమ, మంగళవారాల్లో జిల్లాలో కిలో లైవ్ బర్డ్ ధర రూ.190 ఉండగా, డ్రెస్డ్ రూ.310, స్కిన్‌లె్‌స ధర రూ.340 పలుకుతోంది. కేవలం పది రోజుల్లోనే కిలోకు రూ.50 నుంచి రూ.120 వరకు ధర పెరిగింది.
వేసవి కాలం సీజన్‌లో చికెన్ ధరలు సాదారణంగా ఉంటాయి. ఈ ఏడాది వేసవి ప్రారం భం నుంచే ఎండల తీవ్రత అధికంగా ఉంది. మే మొదటి వారంలో జిల్లాలో 44డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరింది. దీంతో పౌలీ్ట్ర ఫారాల్లోని బ్రా యిలర్ కోళ్లు ఉష్ణోగత్రలను తట్టుకోలేకపోతున్నాయి. ప్రతీ షెడ్డులో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. దీంతో పౌలీ్ట్ర నిర్వాహకులకు నష్టాలతో పాటు మార్కెట్‌లో బ్రా యిలర్ కోళ్ల సరఫరాపై తీవ్ర ప్రభావం పడిం ది. మార్కెట్‌లో చికెన్ డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. దీంతో పోషక విలువలు అధికంగా ఉం డటమేగాక మాంసం ప్రియులు ఇష్టంగా తినే చికెన్‌ను ప్రస్తుతం ఇంటికి బంధువులు వస్తేనో లేక విందు, వినోదాలకు మాత్రమే కొనుగోలుచేసే పరిస్థితులు నెలకొన్నాయని మాంసం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతీ బ్యాచ్‌కు కోటిన్నర బ్రాయిలర్ కోళ్ల పెంపకం
హైదరాబాద్ మహానగర సరిహద్దున జిల్లా విస్తరించడంతో పెద్ద సంఖ్యలో బ్రాయిలర్ కోళ్ల పెంపకం నడుస్తోంది. గ్రామీణ ప్రాంత యువత, ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలు అనుబంధ జీవనోపాధిగా కోళ్ల షెడ్ల నిర్మాణం చేసి చికెన్‌కోసం వినియోగించే బ్రాయిలర్ కోళ్లను సాకుతున్నారు. అయితే వీటిని కార్పొరేట్ స్థాయిలో ఉన్న వెన్‌క్యాబ్, సుగుణ, స్నేహ వంటి కంపెనీలు ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో పౌలీ్ట్ర నిర్వాహకులకు కమీషన్ చెల్లించి కోళ్లను తీసుకెళ్తున్నాయి. అదే విధంగా మార్కెట్‌లో కోళ్లు అందుబాటు ప్రకారం ధరల హెచ్చతగ్గులను ఈ బడా కంపెనీలే నిర్ధారిస్తున్నాయి. జిల్లాలోని బ్రాయిలర్ చికెన్‌ను స్థానిక మార్కెట్లతో పాటు హైదరాబాద్, తదితర రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. అయితే ఇటీవలి ఎండల తీవ్రతను షెడ్లలో కోళ్లు తట్టుకోలేక చికెన్ ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావం చూపింది. మార్కెట్‌లో చికెన్ అందుబాటులో లేకపోవడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.
ప్రతీ రోజు చనిపోతున్న కోళ్లు
ఎండల తీవ్రత కారణంగా అధిక ఉష్ణోగ్రతలను బ్రాయిలర్ కోళ్లు తట్టుకోలేకపోతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఒక్కో కోళ్ల ఫారంలో సామర్థ్యాన్నిబట్టి రోజుకు వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఎండల కారణంగా కోళ్లు దాణా సైతం తినకపోవడంతో అనుకున్న ప్రకారం బరువు పెరగడం లేదు. దీంతో చికెన్ దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా సాధారణ దిగుబడికి సగానికి సగం తగ్గినట్టుగా దుకాణదారులు చెబుతున్నారు. ఈ కారణంగా కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు, నిర్వహణ వ్యయం రాబట్టుకునేందుకు అమాంతం ధరలు పెంచాయి.
జిల్లాలో చికెన్ ధర (కిలో) ఇలా..
డ్రెస్డ్ చికెన్ రూ.310
స్కిన్‌లె్‌స రూ.340
లైవ్‌కోడి రూ.190