Share News

యువకుల ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:31 AM

శాలిగౌరారం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ప్రేమ విఫలమైందని ఇద్దరు యువకు లు క్రిమిసంహార మందు తాగి ఆత్మహత్యాయ్నం చేశారు.

యువకుల ఆత్మహత్యాయత్నం

--------------------------------------

శాలిగౌరారం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ప్రేమ విఫలమైందని ఇద్దరు యువకు లు క్రిమిసంహార మందు తాగి ఆత్మహత్యాయ్నం చేశారు. ఈ సంఘటన నల్లగొం డ జిల్లా శాలిగౌరారం మండలం శాలిలింగోటం గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శాలిలింగోటం గ్రామానికి చెందిన లోడే పవన్‌ (21), కోనేటి అఖిల్‌ (23) చిన్నటినుంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి నల్లగొండ లో ఐటీఐ పూర్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం లోడే పవన్‌, కోనేటి అఖిల్‌ మ ద్యంలో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికుల స మాచారం మేరకు 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈఎంటీ హే మంత్‌, పైలట్‌ సమీర్‌ యువకులకు ప్రథమ చికిత్స అందిస్తూ నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు నల్లగొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

ప్రేమ విఫలమే కారణమా...?

ఆత్మహత్యాయత్నానికి ప్రేమ విఫలమా?.. ఇంకా ఏమైనా కారణాల ఉన్నాయా అనే కోణంలో అనుమానిస్తున్నారు. ప్రేమించిన అమ్మాయిలు తమకు దక్కడం లేద నే బాధతోనే ఆత్మహత్యాయత్నం పాల్పడినట్లు తెలిసింది. శాలిలింగోటం గ్రామానికి చెందిన లోడే పవన్‌, అదే గ్రామానికి చెందిన కోనేటి అఖిల్‌ ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి నల్లగొండలో ఐటీఐ పూర్తి చేశారు. ఇది లా ఉంటే లోడే పవన్‌ కట్టంగూరు మండలానికి చెందిన బాలికను ప్రేమించినట్లు తెలిసింది. ఇద్దరు కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. పెద్ద మనషుల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టినట్లు సమాచారం. దీంతో పవన్‌ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిసింది. కోనేటి అఖిల్‌ హైదరాబాద్‌కు చెందిన ఒక అమ్మాయిని ప్రేమించగా, ఆమె ఫోన్‌ చేసి నేను నిన్ను ప్రేమించడం లేదు. ఇకపై నాకు కాల్‌ చే యొద్దు అని చెప్పినట్లు సమాచారం. దీంతో అఖిల్‌ కూడా మనోవేదనకు గురయ్యాడు. ఇరువురు స్నేహితులు ప్రేమలో విఫలమయ్యామని కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి మద్యం గడ్డి మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

-------------------------------------------

Updated Date - Mar 05 , 2026 | 12:31 AM