మూడు వారాల్లో నివేదికలు ఇవ్వండి
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:22 AM
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన కర్ల రాజేష్ మృతిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. 2025న నవంబరు 4న చిలుకూరు పోలీసులు రాజే్‌షను అరెస్ట్ చేసి 10న రిమాండ్ చేశారు. హుజుర్‌నగర్ సబ్‌జైల్‌లో రాజేష్ అస్వస్ధతకు గురికావడంతో హైదరాబాద్‌కు తరలించారు.
కర్ల రాజేష్ మృతిపై ఎనఆర్‌సీ ఆదేశం
కోదాడ, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన కర్ల రాజేష్ మృతిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. 2025న నవంబరు 4న చిలుకూరు పోలీసులు రాజే్‌షను అరెస్ట్ చేసి 10న రిమాండ్ చేశారు. హుజుర్‌నగర్ సబ్‌జైల్‌లో రాజేష్ అస్వస్ధతకు గురికావడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవంబరు 16న మృతి చెందారు. పోలీసులు కొట్టడంతోనే రాజేష్ మృతి చెందాడని, న్యాయం చేయాలని ఐదు రోజులు కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. అప్పటి వరకు రాజేష్ అంత్యక్రియలు నిర్వహించబోమని బీష్మించారు. దీంతో రాజేష్ కుటుంబ సభ్యులు, ఆందోళనకారులతో సూర్యాపేట డీఎస్పీ చర్చలు జరిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, రూ.8లక్షలు ఇవ్వాలని డీఎస్పీ ముందు డిమాండ్ ఉంచగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించటంతో ఆందోళన విరమించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్మించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ, రాజేష్ మృతి కారకులైన కోదాడ రూరల్ సీఐ, అనంతగిరి పోలీసులపై మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించి రాజేష్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, ఆర్థికసాయం అందించింది. కాగా రాజేష్ మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ రాజేష్ తల్లి లలితమ్మ జాతీయ మానవ హక్కుల కమిషనను ఆశ్రయించింది. దీంతో పోలీసుల నిర్బంధం నుంచి మరణం వరకు జరిగిన సంఘటనల, వైద్య పరీక్షల, చికిత్సకు సంబంధించిన పూర్తి మెడికల్ రికార్డులు, పంచనామా, పోస్టుమార్టం నివేదిక, పోస్టుమార్టం సీడీ, మేజిసి్ట్రయల్ విచారణ నివేదికలను మూడు మూడు వారాల్లో సమర్చించాలని ఎన్‌ఆర్‌ఎసీ సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది.