Share News

ప్రహరీ లేక విద్యార్థుల పాట్లు

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:49 PM

(ఆంధ్రజ్యోతి-దేవరకొండ): దేవరకొండ డివిజన పరిధిలోని కొమ్మెపల్లి గిరిజన గురుకుల పాఠశాలలో ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  ప్రహరీ లేక విద్యార్థుల పాట్లు

పట్టించుకోని అధికారులు

(ఆంధ్రజ్యోతి-దేవరకొండ): దేవరకొండ డివిజన పరిధిలోని కొమ్మెపల్లి గిరిజన గురుకుల పాఠశాలలో ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతంలో ఉండడంతో వర్షాలు వస్తే వరదనీరు పాఠశాల ఆవరణంలోకి చేరుతోంది. ప్రహరీ లేకపోవడంతో క్రిమికీటకాలు వస్తుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడే పరిస్థితి. పాఠశాల, కళాశాలల్లో 5 నుంచి ఇంటర్‌ వరకు తరగతులు ఉన్నాయి. 2022లో గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలను ఏర్పాటు చేశారు. కానీ అప్పటి నుంచి ప్రహరీ నిర్మాణానికి నోచుకోలేదు.

పాఠశాల, కళాశాలలోనియోజకవర్గ పరిధిలోని 650కి పైగా విద్యార్థులు ఉన్నారు. వర్షం వస్తే వర్షపునీరు కళాశాల ఆవరణంలోకి చేరుతుంది. గత సంవత్సరం అక్టోబరులో కురిసిన భారీ వర్షానికి పాఠశాల చుట్టు భారీగా వరదనీరు చేరింది. విద్యార్థులు ఎటు వెళ్లలేక పాఠశాలలోనే చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న అప్పటి జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరతచంద్రపవార్‌, ఆర్డీవో రమణారెడ్డితోపాటు పోలీస్‌, రెవెన్యూ అధికారులు కళాశాల వద్దకు చేరుకున్నారు. ఎస్పీ శరతచంద్రపవార్‌ అధికారులతో కలిసి తాళ్ల సహాయంతో విద్యార్థులను సురక్షితంగా బయటకు తెచ్చారు. వర్షాలు తగ్గేంతవరకు మూడు రోజులపాటు పాఠశాలకు సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెం దారు. కాగా వర్షపునీరు తగ్గాక ప్రత్యామ్నాయంగా తాత్కాలిక చర్య లు చేపట్టా రే తప్పా పూర్తిస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేటి వరకు ప్రహరీ నిర్మించకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు దేవరకొండ మండలంలో బీసీ వసతిగృహాలు రెండు అద్దె భవనాల లో కొనసాగుతున్నాయి. కాగా దేవరకొండ బీసీ బాలుర వసతిగృహం రేకుల షెడ్డు కావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

వర్షం వస్తే భయమేస్తుంది

ప్రహరీ లేకపోవడం, లోతట్టు ప్రాంతం ఉండడంతో వర్షపునీరు కళాశాలలోకి చేరుతుంది. గతేడాది వర్షానికి నీళ్లు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ప్రహరీ లేకపోవడంతో క్రిమికీటకాలు వస్తున్నాయి. ప్రహరీ నిర్మించి సమస్యను పరిష్కరించాలి.

-సాయికుమార్‌, ఇంటర్‌ విద్యార్ధి,

కొమ్మెపల్లి ఎస్టీ గురుకుల కళాశాల

Updated Date - Jul 05 , 2026 | 11:49 PM