Share News

ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు తప్పనిసరి

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:34 AM

పట్టణంలోని ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలను తప్పనిసరిగా నిర్మించుకుని, వాన నీటిని సంరక్షించుకోవాలని చౌటుప్పల్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన మొగుదా ల పావని రమేష్‌ గౌడ్‌ కోరారు.

ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు తప్పనిసరి
చౌటుప్పల్‌లో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

చౌటుప్పల్‌ టౌన, జూలై 16 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలను తప్పనిసరిగా నిర్మించుకుని, వాన నీటిని సంరక్షించుకోవాలని చౌటుప్పల్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన మొగుదా ల పావని రమేష్‌ గౌడ్‌ కోరారు. పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయంలో గురువారం జలశక్తి అభియాన కార్యక్రమాన్ని నిర్వహించి నీటి సంరక్షణ- నీటి సద్వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు అధికారులు, కౌన్సిలర్లు, మునిసిపల్‌ సిబ్బందితో కమిషనర్‌ ఎన్వీ నాయక్‌ ప్రతిజ్ఞ చేశారు. ఇందుకు సంబందించిన ప్రచార సామాగ్రిని విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన పావని మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఆమె అన్నారు. పట్టణాన్ని జల సమృద్ధిగా మార్చడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, వాన నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపించడంతోనే జల సమృద్ధి సాధ్యమవుతుందని ఆమె అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ ఎన.వెంకటేశ్వరనాయక్‌, వైస్‌ చైర్మన గోశిక వినయ్‌ కుమార్‌, కౌన్సిలర్‌లు కొసనం రాకేష్‌ రెడ్డి, బద్రి గాలయ్య, పాక చిరంజీవి, పి.మధుసూదన, ఎండి. హన్నూబాయి, కో- ఆప్షెన సభ్యులు పస్తం గంగ రాములు, ఎండి.బాబా షరీఫ్‌, మేనేజర్‌ శ్రీధర్‌ రెడ్డి, ఆర్వో అంజయ్య, శానిటరీ ఇన్సపెక్టర్‌ హనుమాన ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 12:34 AM