పెస్టిసైడ్స్ వ్యాపారం మందగమనం
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:05 AM
వ్యవసాయం చాలా వరకు రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. వర్షపాతం భూగర్భజలాల లభ్యత, సాగునీటి సరఫరా తద్వారా పంటల సాగుపై ప్రభా వం చూపించడం సహజం.
ఉమ్మడి జిల్లాలో రూ.60 కోట్ల మేర విక్రయాలు తగ్గుదల
వానాకాలం సాగుపై ఎల్‌నినో ప్రభావం
ఒక్కో హోల్‌సేల్ దుకాణం నుంచి రూ.6కోట్ల నిల్వ వెనక్కి
(ఆంధ్రజ్యోతి-కోదాడ)
వ్యవసాయం చాలా వరకు రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. వర్షపాతం భూగర్భజలాల లభ్యత, సాగునీటి సరఫరా తద్వారా పంటల సాగుపై ప్రభా వం చూపించడం సహజం. కాగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు పడలేదు. అదేవిధంగా వరి సాగుకు ప్రధాన నీటి వనరుగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీరు రాలేదు. దీంతో ఆయకట్టు, నాన ఆయకట్లు రైతులు సాగును తగ్గించారు. ఫలితంగా ఆ ప్రభావం దిగుబడిపైనే కా పంట దిగుబడికి ఉపయోగించే ఫెస్టిసైడ్స్(పురుగుమందు) విక్రయాలపై పడింది. అందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10హోల్‌సేల్ పెస్టిసైడ్స్ దుకాణాలు ఉన్నా యి. ఒక్కో దుకాణాదారుడు ప్రతి ఏడాది జూన వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి రూ.15 కోట్ల పెస్టిసైడ్స్‌లు దిగుమతి చేసుకుంటారు. సెప్టెంబరు చివరినాటికి సుమారు రూ.14.40కోట్ల విక్రయాలు చేస్తారు. మిగిలిన రూ.60 లక్షల సరుకును తిరిగి వెనక్కి పంపిస్తుంటారు.
60 శాతం తగ్గిన వరి సాగు
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం సాగు అనుబంధ రంగాలపై తీవ్రంగా పడింది. వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, భూగర్భజలాలు అడుగంటుతుండటంతో రబీ సీజనలో రైతులు సాగును తగ్గించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన సాధారణంగా 3.30 హెక్టార్లలో వరి సాగుచేసేవారు. ఈ ఏడాది సుమారు 60 శాతం మేర సాగు విస్తీర్ణం తగ్గింది. దీనిప్రభావం అనుబంధరంగాలపై పడింది. ప్రధానంగా పంట దిగుబడి పెరిగేందుకు, తెగుళ్ల నివారణకు ఉపయోగించే పెస్టిసైడ్స్ విక్రయాలపై పడింది. ఒక్కో దుకాణదారుడు రూ.15కోట్ల పురుగు మందులు కొనుగోలు చేయగా రూ.9 కోట్ల సరుకు మాత్రమే విక్రయించారు. రూ.6 కోట్ల విక్రయాలు తగ్గాయి. ఆ లెక్కన ఉమ్మడి జిల్లాలో రూ.60 కోట్ల ఫెస్టిసైడ్స్ విక్రయాలు తగ్గడంతో ఆ సరుకును సంబంధిత కంపెనీలకు తిరిగి పంపించినట్లు సమాచారం.
సరుకు ఆర్డర్ నిలిపివేత
వానాకాలం సీజనలో కొనుగోళ్లు తగ్గి 40 శాతం పెస్టిసైడ్స్‌ను వ్యాపారులు వెనక్కి పంపించారు. పంట చివరి దశ రెండు నెలలుగా విక్రయాలు సరిగా లేవు. వచ్చే సీజనలో వర్షాలు పడతాయన్న ఆశలేకపోవడంతో సాగుకు కష్టకాలం ఉందని భావించి యాసంగి సీజనకు ఆర్డర్‌ను నిలిపివేసినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. తాగునీటికే ఇబ్బంది తప్పేలా లేదు, ఇక సాగు అనేది కష్టమని వ్యాపారులు నిర్ణయానికి వచ్చారు. అయితే దుకాణాలు ఎలా నిర్వహించాలో, సిబ్బందికి వేతనాలు ఎలా చెల్లించాలో అన్న ఆందోళనలో చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ రంగమైన పెస్టిసైడ్స్ వ్యాపారులను, రైతులను, కూలీలను ఆదుకోవాలని కోరుతున్నారు.
35 ఏళ్లలో ఇటువంటి పరిస్థితి చూడలే
పెస్టిసైడ్స్ వ్యాపారంలో 35ఏళ్లుగా ఉన్నా. 2003లో ఇటువంటి పరిస్థితి వచ్చింది. మొదటి పంటకు మాత్రమే ఇబ్బందిపడ్డాం. రెండో పంటకు వర్షాలు బాగాకురిశాయి. పురుగుమందుల విక్రయాలు అధికంగా జరిగాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వర్షం వస్తుందో రాదో తెలియని పరిస్థితి. దీంతో రిటైల్ వ్యాపారులు కొత్తగా ఆర్డర్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతి ఏడాది రెండు సీజన్లలో కలిపి రూ.30కోట్ల వ్యాపారం చేస్తాం. ప్రస్తుతం రూ.9కోట్లు చేయలేదు. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటోందో ఏమో. దుకాణంలో పనిచేసే 10మందికి జీతాలు ఎలా ఇవ్వాలో అర్థం కావటంలేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచన చేసి ఆదుకోవాలి.
-పెస్టిసైడ్స్ హోల్‌సేల్ వ్యాపారి