Share News

ఎస్‌ఎల్‌బీసీ నీటి విడుదల కొనసాగింపు

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:09 AM

పెద్దవూర, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల పరిసర ప్రాంతాల్లో పొలాలకు ఎస్‌ఎల్‌బీసీ డీ 8/9 డిస్ర్టిబ్యూటర్ల ద్వారా నీటిపారుతుంది.

ఎస్‌ఎల్‌బీసీ  నీటి  విడుదల కొనసాగింపు

పెద్దవూర, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల పరిసర ప్రాంతాల్లో పొలాలకు ఎస్‌ఎల్‌బీసీ డీ 8/9 డిస్ర్టిబ్యూటర్ల ద్వారా నీటిపారుతుంది. ఇటీ వల పంట పూర్త య్యిందని భావించిన అధికారులు నీటి విడుదలను నిలుపుదల చేశారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతుండడంతో టీడీపీ నాయకుడు దాసరి శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో రైతులు ఏఈ జీవేష్‌కు నీటి విడుదలను కొనసాగించాలని వినతి పత్రం అందజేశారు. పొలాలను ప్రత్యక్షంగా పరి శీలించిన తరువాత ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు నీటిని కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చారు. రైతులు కొండలు, లక్ష్మారెడ్డి, అంజి రెడ్డి, సూర్య, అంజి అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Apr 09 , 2026 | 12:09 AM