Share News

కొండపై దుకాణాలు యథావిధిగా కొనసాగించాలి

ABN , Publish Date - May 03 , 2026 | 11:33 PM

యాదగిరిగుట్ట రూరల్‌, మే 3,(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట కొండపైన దా దాపుగా 60 ఏళ్లుగా కొనసాగిస్తున్న దుకాణాలను యథావిధిగా కొనసాగించాలని దేవ స్థానం వర్తక సంఘం అధ్యక్షుడు గడ్డమీది మాధవులుగౌడ్‌, సంఘం ఉపాధ్యక్షులు తడక వెంకటేష్‌, కీసరి బాలరాజ్‌గౌడ్‌, నర్సింగ్‌రావు కోరారు.

 కొండపై  దుకాణాలు యథావిధిగా కొనసాగించాలి

యాదగిరిగుట్ట రూరల్‌, మే 3,(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట కొండపైన దా దాపుగా 60 ఏళ్లుగా కొనసాగిస్తున్న దుకాణాలను యథావిధిగా కొనసాగించాలని దేవ స్థానం వర్తక సంఘం అధ్యక్షుడు గడ్డమీది మాధవులుగౌడ్‌, సంఘం ఉపాధ్యక్షులు తడక వెంకటేష్‌, కీసరి బాలరాజ్‌గౌడ్‌, నర్సింగ్‌రావు కోరారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొండపైన మొత్తం 114 దుకాణాల నిర్వహకుల కుటుంబాలతో పాటుగా మరో 500 మంది కుటుంబాలను దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులు దుకాణాలు బహిరంగ వేలం వేస్తే దేవస్థానానికి రూ. కోట్ల ఆదాయం వస్తుందని నమ్మబలుకుతూ మా పొట్ట కొట్టడానికి యత్నిస్తున్నాయని ఆరోపించారు. దుకాణాలను వేలం వేస్తే కార్పొరేట్‌ శక్తులకు దుకాణాలు దక్కి ంచ ుకునే ఆవకాశం ఉందని, దీంతో స్థానికులు పూర్తిగా ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణాల నిర్వహకులు అందరూ స్థానికులేనని చాలా ఏళ్లుగా దు కాణాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. పార్టీలకు అతీతంగా దుకాణాలను నిర్వహించుకుంటున్నామని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన దుకాణాల యజమానులు ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో దుకాణాలు నిర్వహకులు భరత్‌, సిద్దులు, సుగుణమ్మ, ఇందిరాగాంధీ, నల్ల వెంకట్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2026 | 11:33 PM