Share News

చలికి గజ..గజ

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:32 AM

జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీలకు చేరాయి. ఈ నెల 13వ తేదీ నుంచి క్రమంగా ఉష్ణోగ్రత లు పడిపోతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ ఉన్ని దుస్తులు, జర్కీలు కొనుగోలు చేస్తున్నారు.

చలికి గజ..గజ

వారం రోజులుగా పెరిగిన చలి తీవ్రత

జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట టౌన్‌): జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీలకు చేరాయి. ఈ నెల 13వ తేదీ నుంచి క్రమంగా ఉష్ణోగ్రత లు పడిపోతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ ఉన్ని దుస్తులు, జర్కీలు కొనుగోలు చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారు. ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది.

చలి తీవ్రతకు ఉదయం పూట బయటకు వెళ్లలేక చాలామంది ఇళ్లలోనే ఉంటున్నారు. చలి నుంచి రక్షణ కోసం ప్రజలు ఉన్నిదుస్తుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నిదుస్తుల ధరలు గతంలో కన్నా రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా పెరిగాయి. చలి అధికంగా ఉండటంతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చలి నుంచి ఎలా రక్షణ పొందాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై నిపుణులు సూచిస్తున్నారు.

మునిసిపల్‌ కార్మికులకు ఇబ్బందులు

సూర్యాపేట మునిసిపాలిటీ పరిధిలో 48 వార్డులు ఉండగా 400 మంది పారిశుధ్య కార్మికులు మూడు షిఫ్ట్‌లలో విధులు నిర్వహిస్తున్నా రు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంట ల వరకు, అదేవిధంగా ఉదయం 5 గంటల నుం చి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారు. అయితే రాత్రి సమయంలో విధుల్లో ఉండే పారిశుధ్య కార్మికులు చలికి ఇబ్బంది పడుతున్నారు. అయితే మునిసిపాలిటీ నుంచి వీరికి ప్రతి ఏడాది చెప్పులు, బూట్లు, కొబ్బరినూనె, యూనిఫాం, సబ్బులు అందించే వారు. గత ఐదేళ్లుగా అందడంలేదని కార్మికులు తెలిపారు.

ఇబ్బందుల్లో పిల్లలు, వృద్ధులు

పిల్లలు, వృద్ధులు చలికి తట్టుకునే శక్తి ఎక్కువ ఉండదు. వీరికి రోగ నియంత్రణ శక్తి తక్కువగా ఊం డటంతో వారు రోగాల బారిన పడుతున్నారు. తప్పనిసరి మంకీ క్యాప్‌, స్వెటర్‌ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక 50 నుంచి 80 ఏళ్ల వయస్సు కలిగి న వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు. చాలామంది మధుమేహం, రక్తపోటు, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు. వ్యాధులకు సంబంధించిన రోజు వారి మాత్రలు దగ్గర ఉంచుకోవాలి. మొత్తం మీద పిల్లలు, వృద్ధులు చలికాలంలో ఇంటి వద్ద ఉండడం ఆరోగ్యకరం. మూడు నుంచి ఐదు రోజుల పాటు జలుబు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వారానికోసారి వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఆసుపత్రులకు పెరిగిన తాకిడి

ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా సైన్‌సతో పాటు న్యూమోనియా కేసులు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చిన్నారులతో పాటు వృద్ధులు ఉంటున్నారు.

ఇవీ జాగ్రత్తలు

చలితో అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లేప్పుడు స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, గ్లోవ్స్‌ ధరించాలని, ఉదయం, సాయంత్రం నడక బదులు ఇంటి వద్ద యోగా, చిన్నచిన్న వ్యాయామాలు, సైక్లింగ్‌, ట్రెడ్‌ మిల్లుపై వాకింగ్‌ చేసుకోవాలంటున్నారు. చలికాలం ముగిసే వరకు 45 నిమిషాలు వ్యాయామం చేయాలని, సమతుల్య ఆహారం తీసుకోవాలని తెలిపారు. తేలికపాటి, త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడంతో వేడివేడిగా ఉన్నప్పుడే తినాలని సూచిస్తున్నారు. వెచ్చగా ఉన్న నీరు తాగడంతో వెచ్చని నీటితో స్నానం చేయాలని, చల్లని గాలులు వీస్తుండడంతో బ్యాక్టీరియాలు శరీరాన్ని తాకుతాయని, అలాంటప్పుడు ఎవరైనా షేక్‌ హ్యాండ్‌ ఇస్తే ఇంటికి వచ్చాక సబ్బుతో శుభ్రంగా చేసుకోవాలంటున్నారు. సైన్‌సతో బాధపడే వారు, డస్ట్‌ ఎల్జరీ ఉన్న వారు ముక్కుకు రుమాలు తప్పకుండా కట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. చలితీవ్రతతో పిల్లలకు దగ్గు, జలుబు, న్యూమోనియా, చలి జ్వరం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

వ్యాయమ సమయాలు మార్పు చేసుకోవాలి : హమీద్‌ఖాన్‌, రిటైర్డ్‌ ఉద్యోగి, సూర్యాపేట

చలి అధికంగా ఉంది. ఉదయం వేళ బయటకు వెళ్లాలంటేనే ఇబ్బందిగా మారింది. ఎండ వచ్చిన తర్వాతనే బయటకు వెళ్తున్నాం. వృద్ధులు, వ్యాయమ సమయాలు మార్పుచేసుకోవాలి. ఉదయం 7 తర్వాత వాకింగ్‌చేయాలి. సాయంత్రం అవసరమైతే తప్ప బయటకురావద్దు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యులను సంప్రదించాలి.

Updated Date - Nov 20 , 2026 | 12:32 AM