Share News

ఆర్టీసీలో ఎలక్ట్రికల్‌ బస్సులకు బ్రేక్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:03 AM

నల్లగొండ, జూలై 2(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 7 డిపోల పరిధిలో ఆర్టీసీలోని ఎలక్ట్రికల్‌ బస్సులను నిలిపివేశారు. కరీంనగర్‌లో ఎలక్ట్రికల్‌ బస్సులు దగ్ధం కావడంతో అధికారులు పునరాలోచనలో ప డ్డారు.

 ఆర్టీసీలో ఎలక్ట్రికల్‌ బస్సులకు బ్రేక్‌

ఫ రీజియన్‌ పరిధిలో 179 బస్సులు నిలిపివేత

ఫ వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే రోడ్లపైకి

ఫ బస్సుల రద్దుతో ప్రయాణికులకు ఇక్కట్లు

నల్లగొండ, జూలై 2(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 7 డిపోల పరిధిలో ఆర్టీసీలోని ఎలక్ట్రికల్‌ బస్సులను నిలిపివేశారు. కరీంనగర్‌లో ఎలక్ట్రికల్‌ బస్సులు దగ్ధం కావడంతో అధికారులు పునరాలోచనలో ప డ్డారు. బస్సులు దగ్ధం కావడానికి కారణాలను అన్వేషిస్తున్న అధికారులు రాష్ట్రవ్యాప్తంగా బస్సుల నిలివేతలో భాగంగా నల్లగొండ, సూర్యాపేట, యా దాద్రిభువనగిరి పరిధిలోని అన్ని డిపోల్లో ఎలక్ట్రికల్‌ బస్సులను పక్కన బె ట్టారు. ఈ బస్సులన్నింటినీ ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌ నిర్వహించిన తర్వాతే రో డ్లపై నడిపే అవకాశాలు ఉన్నాయి. గత జూన్‌ మాసంలో కరీంనగర్‌ నుం చి హైదరాబాద్‌ వెళ్లుతున్న ఎలక్ట్రిక్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు అం టుకోవడంతో దగ్ధమైన ఈ బస్సు నుంచి డ్రైవర్‌ అప్రమత్తతతో సుమారు గా 40 మందికి పైగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. జూలై 1వ తేదీన అదే జిల్లాలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మరో ఎలక్ట్రికల్‌ బస్సు దగ్ధమవడంతో ఆర్టీసీ యంత్రాంగంతో పాటు ప్రభుత్వం అప్రమత్తమైంది.

రీజియన్‌లో 179 బస్సులు నిలిపివేత

ఎలక్ట్రికల్‌ బస్సులు కాలిపోవడంతో ప్రయాణికులు భద్రతపరమైన ఆం దోళనలు మొదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఆర్టీసీ ఉన్నతాధికారులు రీజియన్‌లోని 179 ఎలక్ట్రికల్‌ బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేసి డిపోలకే పరిమితం చేశారు. వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ఉన్నతస్థాయిలో విచారణ చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. తాత్కాలికం గా ఎలక్ట్రికల్‌ బస్సుల రద్దు వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రీజియన్‌ పరిధిలో ఎలక్ట్రికల్‌ బస్సులు నిలిచిపోవడానికి వాటి రాకపోకలకు బ్రేక్‌ పడటానికి ప్రధాన కారణాలు కరీంనగర్‌లో బస్సులు దగ్ధం కావడం ఒక కారణం కాగా, తరచుగా బ్యాటరీ సమస్యలు మెయింటెనెన్స్‌ లోపాలు తలెత్తుతున్నాయి. చాలా ఎలక్ట్రికల్‌ బస్సులు ఎక్కడికక్కడ మొరాయిస్తున్నట్లు తెలుస్తుంది. ఉదాహరణకు కొద్ది రోజుల క్రితం నల్లగొం డ నుంచి తాటికల్‌, నకిరేకల్‌ మీదుగా సూర్యాపేట వెళ్లే బస్సు చందనపల్లి సమీపంలో బస్సు నిలిచిపోయింది. అదేవిధంగా నార్కట్‌పల్లి నల్లగొండ మ ధ్యలో కూడా ఒక ఎలక్ట్రికల్‌ బస్సు మొరాయించింది. బ్యాటరీ లోపాలతో పాటు అనేక సాంకేతిక కారణాలతో బస్సులు తరచుగా రోడ్డుపైనే ఆగిపోవడం గమనార్హం.

ప్రైవేట్‌ సంస్థల ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్‌ బస్సులు....

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎలక్ట్రికల్‌ బస్సుల వ్యవస్థను తీసుకొచ్చిన సమయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు, డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఎలక్ట్రికల్‌ బస్సుల వల్ల ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్‌ పోస్టులు భర్తీ కాకుండా పోతాయని తమ ఉద్యోగాలకు భద్రతా లేకుండా పోతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రైవేట్‌ సంస్థల ద్వారా నడుపుతున్న ఈ బస్సులకు సకాలంలో విడిభాగాలు దొరకకపోవడంతో సర్వీసింగ్‌ కూడా ఆలస్యమవుతుంది. ఆయా డిపోలల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చార్జింగ్‌ పాయింట్‌ పెట్టారు. అయితే బస్సుల సంఖ్యకు అనుగుణంగా చార్జింగ్‌ పాయింట్‌ లేక పోవడం ఉన్న చార్జింగ్‌ పాయింట్లలో తరచుగా స్విచ్‌ బోర్డులు ఫెయిల్‌ కావడం, ట్రాన్స్‌ఫార్మర్లపై లోడ్‌ పడుతుండటంతో చార్జింగ్‌ లేక బడ్లను ఆపివేస్తున్నారు. ఎలక్ట్రికల్‌ బస్సులు సాధారణ డీజిల్‌ బస్సుల కంటే భిన్నంగా ఉండటంతో ఆ బస్సులు నడపటానికి అనుభవం, నైపుణ్యం ఉన్న డ్రైవర్లు అవసరం ఉంటుంది. డ్రైవర్ల కొరత కూడా సమస్యగా మారింది. మొత్తంగా రీజియన్‌ వ్యాప్తంగా ఎలక్ట్రికల్‌ బస్సులను నిలిపివేసిన నేపథ్యంలో బస్సుల కొరత ఏర్పడి ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈవీ బస్సుల నిలిపివేతతో ప్రజల ఇబ్బందులు

రాష్ట్రవ్యాప్తంగా ఈవీ బస్సులను ఆకస్మికంగా నిలిపివేయడంతో ప్ర యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఓ ఎలక్ర్టి క్‌ బస్సు అగ్నికి ఆహుతైన ఘటన తర్వాత సరైన ప్రత్యామ్నాయ ఏ ర్పాట్లు లేకుండానే బస్సులను నిలిపివేయడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బోర్డుల పేరుతో ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్‌ జేబీఎం బస్సులపై ఆ ధారపడకుండా, ప్రభుత్వమే సొంతంగా బస్సులు తయారు చేసి నడపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

- పల్లా దేవేందర్‌రెడ్డి, సీఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి

పరిశీలన కోసం బస్సులను నిలిపారు

ఎలక్ట్రికల్‌ బస్సులను పరిశీలించడం కోసం నల్లగొండ రీజియన్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేశారు. బస్సులన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత తిరిగి రీజియన్‌లో రాకపోకలకు అను మతిస్తాం. బస్సుల్లో సాం కేతిక సమస్యలు తలెత్తడానికి కారణాలను కూడా తెలుసుకుంటాం. పూర్తిస్థాయిలో బస్సుల సమస్యలను అధ్యయనం చేసిన తర్వాతే రోడ్లపై నడిపేందుకు అనుమతిస్తాం.

- జోత్స్న, ఆర్టీసీ ఆర్‌ఎం, నల్లగొండ

Updated Date - Jul 03 , 2026 | 12:03 AM