నాయకులకు భద్రత తొలగింపు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:05 AM
నల్లగొండ, కోదాడ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ జిల్లాకు ఇద్దరు నాయకులకు గన్‌మెన్‌లను తొలగించడంతో పాటు సూర్యాపే ట జిల్లాలో ఒకరికి కుదిస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశం గా మారింది.
నల్లగొండ, కోదాడ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ జిల్లాకు ఇద్దరు నాయకులకు గన్‌మెన్‌లను తొలగించడంతో పాటు సూర్యాపే ట జిల్లాలో ఒకరికి కుదిస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశం గా మారింది. మూడు రోజుల క్రితమే ఈ ఘటన జరిగింది. నల్లగొండ జిల్లాలో అధికార పార్టీ నేతలైన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, నల్లగొం డ మునిసిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివా్‌సరె డ్డి గన్‌మెన్‌లను తొలగించడంతో పా టు సూర్యాపేట జిల్లా కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు గన్‌మెన్‌ల భ ద్రతను కుదించారు. నల్లగొండ జిల్లాలో నేతి విద్యాసాగర్, బుర్రి శ్రీనివాసరెడ్డి గన్‌మెన్లను మాత్రమే తొలగించినట్లు ఎస్బీ సీఐ నాగరాజు ధ్రువీకరించారు. అయితే ఇద్దరు బీజేపీ నేతల గన్‌మెన్లను కూడా తొలగించినట్లు అనధికారికంగా చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకుల భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకోవడంతో నేతల భద్రత ఎలా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 19మంది ప్రజాప్రతినిధులకు గన్‌మెన్ల ఉన్నారు. వీరిలో ఇద్దరు నేతల గన్‌మెన్లను మాత్రమే తొలగించడానికి కారణాలు ఏమై ఉంటుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదేవిధంగా కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావుకు 2+2 గ న్‌మన్‌లు భద్రతను 1+1కు ప్రభుత్వం కుదించింది. వేనేపల్లి చందర్‌రావు నాలుగు పర్యాయాలు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.