పాఠశాల టాపర్ల విమానయానం
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:10 AM
విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వారి ని ప్రోత్సహించేందుకు ఓ ఉపాధ్యాయుడు తాను ఇచ్చిన హామీని నెరవేర్చారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థినులకు విమానయాన అవకాశం క ల్పించారు.
హామీని నెరవేర్చిన కొత్తపల్లి ప్రభుత్వ ఉపాధ్యాయుడు
నల్లగొండ రూరల్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వారి ని ప్రోత్సహించేందుకు ఓ ఉపాధ్యాయుడు తాను ఇచ్చిన హామీని నెరవేర్చారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థినులకు విమానయాన అవకాశం క ల్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ మండలం కొత్తపల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 19 మంది పదో తరగతి చదువుతుండగా, 10 మంది బాలికలు, తొమ్మిది మంది బాలురు ఉన్నారు. 10వ తరగతి పరీక్షలోనూ, ఇంగ్లీ్‌షలోనూ అత్యధిక మార్కులు వచ్చిన వారికి విమానయాన అవకాశం కల్పిస్తానని ఉపాధ్యాయుడు బి.వెంకటేశ్వర్లుచారి ప్రోత్సహించారు. దీంతో పరీక్ష రాసిన 19మందిలో 17 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఏరుకొండ వైష్ణవి 502/600 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా, బుట్టి ఇందూ ఇంగ్లీ్‌షలో 100కు 80 మార్కులు సాధించారు. ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయుడు వైష్ణవి, ఇందులను మే నెల 31వ తేదీన విమానంలో విజయవాడకు తీసుకెళ్లారు. ఉదయం నాలుగు గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానంలో విజయవాడకు తీసుకువెళ్లారు. విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయ దర్శనం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రకాశం బ్యారేజ్ తదితర ప్రాంతాలను చూపించారు. విద్యార్థినులకు టిఫిన్, భోజన ఏర్పాట్లుచేసి అదేరోజు సాయంత్రం 8గంటలకు సురక్షితంగా ఇంటికి చేర్చారు. ఇందుకో సం రూ.20వేలు ఖర్చుపెట్టినట్లు ఉపాధ్యాయుడు బీవీ.చారి తెలిపారు. విద్యార్థినులను విద్యలో ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం చేపట్టానని, గతంలో పనిచేసిన పాఠశాలలో పుస్తకాలు అందజేస్తున్నానని తెలిపారు. గ్రా మీణ ప్రాంత విద్యార్థులకు సరైన ప్రోత్సా హం, ప్రేరణ, పోటీతత్వం కల్పిస్తే వారు అ ద్భుతాలు సృష్టిస్తారన్నారు. ఇంగ్లీష్ టాపర్ విద్యార్థిని ఇందు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతానికి చెందిన తనకు ఇలాంటి అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు.
ఊహించని అవకాశం : ఏరుకొండ వైష్ణవి
నాకు 15 ఏళ్ల వయసులో ఊహించని అవకాశం దక్కింది. విమాన ప్రయాణం స్వర్గంలో విహరించినట్లుగా అనిపించింది. ఈ ప్రేరణతో ఇంటర్‌లో మంచి మార్కులు సాధించి డాక్టర్ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతా.