Share News

సైదన్నా... ఇదేమన్నా

ABN , Publish Date - May 30 , 2026 | 12:12 AM

పాలకవీడు మండలంలో ప్రసిద్ధి చెందిన జాన్‌పహాడ్‌ దర్గా వద్ద కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. వక్ఫ్‌ బోర్డు నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. మండలకేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సైదన్నా... ఇదేమన్నా

ఫాతేహాలకు రూ.1600లు, జుబాకు రూ. 750

దర్గా వద్ద కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నా పట్టింపేదీ?

భక్తులకు వసతులు అంతంతమాత్రమే

పాలకవీడు, మే 29 (ఆంధ్రజ్యోతి): పాలకవీడు మండలంలో ప్రసిద్ధి చెందిన జాన్‌పహాడ్‌ దర్గా వద్ద కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. వక్ఫ్‌ బోర్డు నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. మండలకేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోరిన వరాలిచ్చే జాన్‌పహాడ్‌ సైదన్నకు ప్రతి శుక్రవారం భక్తులు మెక్కులు(కందూరు) తీర్చుకుంటారు. వారి నుంచి కాంట్రాక్టర్లు ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలున్నాయి. రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు నిబంధనలకు విరుద్దంగా వసూలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు సాధారణంగా దర్గాలోకి వెళ్లడానికి ఎలాంటి ప్రవేశ రుసుము అవస రం లేదు. అయితే కాంట్రాక్టర్లు టికెట్‌ ముద్రించి మరీ ప్రవేశ రుసుము వసులు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఒక కుటుంబం గొర్రె పొట్టెలుతో కందూరు జుబా చేయడానికి రూ.750లు, ఫాతే హాలకు రూ.1600లు, ఇతర ఖర్చులతో కలిపి సుమా రు రూ.4వేల వరకు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి వస్తుం దని ఆరోపిస్తున్నారు. ఒక కుటుంబం జాన్‌పహాడ్‌ దర్గా కు వచ్చి దర్గాను దర్శించుకోవాలంటే కనీసం రూ.500 ల వరకు చెల్లించాలని, ద్విచక్ర వాహనాలు పూజ చేయడానికి రూ.400లు, కార్లు, లారీలకు అయి తే రూ.750 నుంచి రూ.1000 వరకు వసులు చేస్తున్నారని విమర్శలున్నాయి. కొబ్బరికాయ కొట్టడానికి కూడా వసులు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు.

వసతుల కల్పనలో విఫలం

దర్గా వద్ద వసతులు లేక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. మహిళలకు కనీస సౌకర్యాలు, విశ్రాంతి గదులు లేవు. తాగునీరు కోసం చాలా దూ రం వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. పక్కనే కృష్ణమ్మ ప్ర వహిస్తున్నా దర్గాను దర్శించుకోవటానికి వచ్చే భక్తుల కు తాగునీరు అందించడంలో వక్ఫ్‌ బోర్డు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని భక్తులు తెలిపారు. కొన్నిచోట్ల కుళాయిలు ఏర్పాటు చేసినా అపరిశుభ్రంగా ఉండడం తో భక్తులు ఆ నీరు తాగడం లేదు. ప్రతి శుక్రవారం దర్గాకు సుమారు 10వేలవరకు భక్తులు ప్రత్యేక పూజ లు నిర్వహించుకుంటారు. ఉర్సు సమయంలో 2 నుం చి 3లక్షల భక్తులు దర్గాను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యా లు లేవు. మరుగుదొడ్లు కూడా అంతంతగానే ఉన్నా యి. పూర్తిసౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయంపై జాన్‌పహాడ్‌ దర్గా వక్ఫ్‌ బోర్డు ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ మహమ్మూద్‌ను ఫోన్‌లో పలుమార్లు సంప్రదించాలని ప్రయత్నించగా ఫోన్‌ కలవలేదు.

అక్రమ వసూళ్లు ఆపాలి : రాజు రాథోడ్‌, జాన్‌పహాడ్‌ దర్గా ఉపసర్పంచ్‌.

భక్తులు దర్గాకు వచ్చి మొక్కు తీర్చుకోవాలంటే కాంట్రాక్టర్ల అక్రమ వసూళ్లకు ఆపాలి. ప్రతీ దానికీ పైసలు ఇవ్వాల్సిందేన.. డబ్బులు ఇవ్వలేమని గట్టి గా మాట్లాడితే భౌతిక దాడులు చేస్తున్నారు. భక్తు లు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వక్స్‌ బోర్డు కనీస సౌకర్యాలు కల్పించాలి.

ఫాతేహాలకు రూ.1600లు ఇవ్వాల్సిందే : మంగ్యా, సూర్యాపేట జిల్లాకేంద్రం.

దర్గాలో జాన్‌పహాడ్‌ సైదన్నకు ఫతేహాలు సమర్పించాలంటే రూ.1600 చెల్లించాల్సిందే. దర్గాలో మొక్కులు తీర్చుకుందామని వస్తే ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

Updated Date - May 30 , 2026 | 12:12 AM