పారిశుధ్య చర్యలు చేపట్టరూ..
ABN , Publish Date - Apr 15 , 2026 | 11:52 PM
పాతగుట్ట (యాదగిరిగుట్ట) దేవస్థానం సమీపంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది.
(ఆంధ్రజ్యోతి-యాదగిరిగుట్ట ) : పాతగుట్ట (యాదగిరిగుట్ట) దేవస్థానం సమీపంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఆలయం వెనుక భాగం నుంచి వెలువడే చెత్తాచెదారంలో డ్రైనేజీ నిండిపోయి దుర్గఽంధం వెదజల్లుతోంది. కాగా, రోడ్లపైకి మురికి నీరు పారుతోంది. వీటికి తోడు పందులు గుంపులుగా తిరుగుతున్నాయి. దోమలు, ఈగలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఫిబ్రవరి మాసంలో జరిగిన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నుంచి కొద్ది కొద్దిగా డ్రైనేజీ నిండిపోయినప్పటికీ శానిటేషన విభాగం ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఆలయం పక్కన భక్తుల కోసం ప్రైవేట్ ఫంక్షన హాళ్లు, అద్దెగదులు ఉన్నాయి. ఇక్కడి నుంచి వ్యాపిస్తున్న దుర్వాసనతో పాతగుట్ట స్వయంభువులను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ముక్కు పుట్టలదిరి ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి మురుగు నీటి దుర్వాసననను నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.