బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:35 AM
నల్లగొండ క్రైం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): అడిగినచోట బస్సు ఆపలేదనే ఆగ్రహంతో ఓ వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిచేశాడు.
నల్లగొండ క్రైం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): అడిగినచోట బస్సు ఆపలేదనే ఆగ్రహంతో ఓ వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిచేశాడు. డ్రైవింగ్ సీటులో ఉండగా చొక్కాపట్టుకుని బయటకులాగి తీవ్రంగా కొట్టాడు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. నల్లగొండ రూరల్ ఎస్‌ఐ సైదాబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నార్కట్‌పల్లి మండలం యడవల్లి గ్రామానికి చెందిన తుపాకుల వెంకటేశ్వర్లు నల్లగొండ పట్టణంలోని వీటీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. తన కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు పంపించేందుకు బస్టాప్ వద్దకు వచ్చాడు. ఉదయం 7.15కు పల్లెవెలుగు ఆర్టీసీ బస్సును డ్రైవర్ రామ్‌కుమార్ హైదరాబాద్ రోడ్డులోని వీటీకాలనీ బస్టా్‌ప వద్ద నిలిపాడు. వివేకానంద విగ్రహం దాటిన తర్వాత ద్విచక్ర వాహనంపై వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులతో కలిసి వస్తూ బస్సును ఆపాడు. వారిని గమనించని డ్రైవర్ ఐటీ హబ్ ఎదురుగా ఉన్న మరో బస్టాప్ వద్ద బస్సును నిలిపారు. బస్సు ఆపకుండా వెళ్లాడన్న ఆగ్రహంతో వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై వేగంగా ఐటీ హబ్ బస్టాప్ వద్దకు వచ్చి, డ్రైవింగ్ సీటులో ఉన్న రామ్‌కుమార్‌ను చొక్కా పట్టుకొని బయటకు లాగి తీవ్రంగా కొట్టాడు. ప్రయాణికులు ఆపాలని ప్రయత్నించినప్పటికీ వెంకటేశ్వర్లు ఏమాత్రం తగ్గలేదు. తనపై జరిగిన దాడి ఘటనను రామ్‌కుమార్ ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలియజేసి రూరల్ పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం డ్రైవర్ డిశ్చార్జి అయ్యా రు. ఆర్‌ఎం కె.జానిరెడ్డి డ్రైవర్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.