దొంగిలించిన ఫోనతో రూ.లక్ష డ్రా
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:52 PM
చోరీ చేసిన ఫోన నుంచి రూ.లక్ష డ్రా చేసిన సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా రాజాపేట మండలం దూదివెంకటాపూర్‌లో శుక్రవారం వెలుగుచూసింది. ఎస్‌ఐ లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దూదివెంకటాపూర్ గ్రామానికి చెందిన భీమగాని సిద్ధులు కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టారు.
రాజాపేట, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : చోరీ చేసిన ఫోన నుంచి రూ.లక్ష డ్రా చేసిన సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా రాజాపేట మండలం దూదివెంకటాపూర్‌లో శుక్రవారం వెలుగుచూసింది. ఎస్‌ఐ లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దూదివెంకటాపూర్ గ్రామానికి చెందిన భీమగాని సిద్ధులు కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టారు. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి సెల్‌ఫోనను చోరీ చేశాడు. ఉదయం లేచి చూసేసరికి ఫోన లేక పోవడంతో ఫోన ద్వారా లావాదేవీలను నిలిపివేయడానికి కొలనుపాక ఎస్‌బీఐకి శుక్రవారం వెళ్లాడు. అప్పటికే అతడి ఖాతాలో ఉన్న రూ.1.80 లక్షల్లో ఫోన పే ద్వారా రూ.లక్ష డ్రా చేశాడు. యూసుఫ్‌గూడ మధురానగర్ ఏటీఎం వద్ద డబ్బులు జమ చేసేందుకు వచ్చిన ఏడుగురు వ్యక్తుల నుంచి నగదు తీసుకుని ఫోన పే ద్వారా డబ్బులు పంపినట్లు బ్యాంక్ స్టేట్‌మెంట్ రికార్డులో తేలింది. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.