Share News

రైస్‌మిల్లర్‌ కొండా లక్ష్మయ్య రిమాండ్‌

ABN , Publish Date - May 09 , 2026 | 12:20 AM

నల్లగొండ క్రైం, మే 8 (ఆంధ్రజ్యోతి): రైస్‌ మిల్లర్‌ కొండా లక్ష్మయ్యను రెండు రోజుల క్రితం అరెస్టు చేయడంతోపాటు రిమాండ్‌కు తరలించారు.

 రైస్‌మిల్లర్‌ కొండా లక్ష్మయ్య రిమాండ్‌

నల్లగొండ క్రైం, మే 8 (ఆంధ్రజ్యోతి): రైస్‌ మిల్లర్‌ కొండా లక్ష్మయ్యను రెండు రోజుల క్రితం అరెస్టు చేయడంతోపాటు రిమాండ్‌కు తరలించారు. కొండా లక్ష్మయ్య విజయవాడ, జగ్గయ్యపేట జంక్షన్‌ సమీపంలో పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. నల్లగొండ సమీపంలోని నార్కట్‌పల్లి -అద్దంకి రహదారిపై రామ్‌లక్ష్మణ్‌ పారాబాయిల్డ్‌ మిల్లును లక్ష్మయ్య నడిపిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో జరిగిన వివరాలను పరిశీలిస్తే 2022-23 యాసంగి పంట కాలంలో రూ.191 కోట్ల విలువైన సుమారు 5,89,533 క్వింటాళ్ల ధాన్యాన్ని చిట్యాల మండలంలోని వరలక్ష్మి మిల్లుతో పాటు కేతేపల్లిలోని చాముండేశ్వరీ మిల్లు, మునుగోడులోని మురళీ మనోహర ఆగ్రో ఫుడ్స్‌, నల్లగొండ రామ్‌లక్ష్మణ మిల్లు, కనకమహాలక్ష్మి మిల్లు, సుమాంజలి, గౌతమి రైస్‌ మిల్లు ఇండస్ట్రీకి చెందిన యజమానులు పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మిల్లర్లపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు చేస్తారన్న భయంతో మిల్లర్లు ఇతర ప్రాంతాలకు పరారయ్యారు. గత మార్చిలో సుమాంజలి, గౌతమి రైస్‌మిల్లుల య జమానుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన ఆరుగురి ఆచూకీ కోసం వెతుకుతున్న సమయంలో కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. కోర్టు వారి పిటిషన్‌ కొట్టివేయడంతో పోలీసులు కొండా లక్ష్మయ్యను అరెస్టు చే శారు. మిగిలిన వారిని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - May 09 , 2026 | 12:20 AM