Share News

10లోగా మరమ్మతులు చేయాలి

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:13 AM

విద్యా సంవత్సరం ప్రారంభానికే ముందే ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అన్ని మరమ్మతు పనులను ఈ నెల 10లోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

10లోగా మరమ్మతులు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ చంద్రశేఖర్‌

కలెక్టర్‌ చంద్రశేఖర్‌

నల్లగొండ, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): విద్యా సంవత్సరం ప్రారంభానికే ముందే ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అన్ని మరమ్మతు పనులను ఈ నెల 10లోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌, పర్నిచర్‌ సౌకర్యాలు కల్పించాలన్నారు. పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు, మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీల్లో మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో బియ్యం నిల్వలు, వంటశాలలు, పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు ఏఐ ఆధారిత తరగతులు నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, అదనపు ఇన్‌చార్జి కలెక్టర్‌ వై.అశోక్‌రెడ్డి, డీఈవో సుశీందర్‌రావు, డీఆర్డీవో శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 12:13 AM