Share News

మళ్లీ మొదలైన రేషన్‌ బియ్యం దందా

ABN , Publish Date - Apr 15 , 2026 | 11:38 PM

చండూరు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ప్రతీ పేదవాళ్లు సన్న బియ్యం అన్నం తినాలని ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. పేదలుదొడ్డు బియ్యాన్ని తినకుండా విక్రయిస్తుండటంతో వృథాను అరికట్టాలని సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుంది.

  మళ్లీ మొదలైన రేషన్‌ బియ్యం దందా

రైసుమిల్లులే కేంద్రంగా అక్రమ వ్యాపారం

నూకలు చేసి కోళ్ల ఫారాలకు సరఫరా

చండూరు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ప్రతీ పేదవాళ్లు సన్న బియ్యం అన్నం తినాలని ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. పేదలుదొడ్డు బియ్యాన్ని తినకుండా విక్రయిస్తుండటంతో వృథాను అరికట్టాలని సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుంది. ఎండాకాలం నేపథ్యంలో మూడు నెలలకు సరిపడా బియ్యం ఒకేసారి లబ్ధిదారులకు పంపి ణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు డీలర్లు అందజేస్తున్నారు. ఒకేసారి మూడు నెలల బియ్యం రావడంతో దళారులు లబ్ధిదారుల కు డబ్బుల ఆశ చూపి కొనుగోలు చేస్తున్నారు. ఇలా తీసుకోగానే దళారులు అలా వచ్చి తీసుకెళ్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ప్రభుత్వాలు పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్న పీడీఎస్‌ బియ్యం, వ్యాపారుల కు వరంగా మారింది. రైస్‌ మిల్లుల యజమానులు కూడా పీడీఎస్‌ బి య్యం దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వారు వాటిని రీసైక్లింగ్‌ చే సి మార్కెట్‌కు తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతు న్నా సివిల్‌ సప్లయ్‌ అధికారులు, పోలీసులు సక్రమంగా దాడులు నిర్వహించకపోవడంతో అక్రమార్కులు తమ వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. కొన్నేళ్లుగా రైసుమిల్లులే కేంద్రంగా ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతోంది. ఒక వేళ అధికారులు రైసుమిల్లులపై దాడులు చేసి పట్టుకుని కేసులు నమోదు చేసినా వ్యాపారులు తమకున్న పలుకుబడితో రాజకీయ నాయకులతో పైరవీలు చేసి కేసు మాఫీ చేయించుకుని తిరిగి తమ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు అడపాదడపా దాడులు చేయడం, ఆపై వదిలేయడంతో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

మచ్చుకు కొన్ని ..

మర్రిగూడ మండల కేంద్రంలో కొన్ని నెలల క్రితం ఓ మిల్లు, నాంపల్లి మండల పరిధిలో మరో మిల్లు నుంచి 120 క్వింటాళ్ల బియ్యాన్ని డీసీఎంలో తరలిస్తుండగా చండూరు మండలం తాస్కానిగూడెం మూలమలుపు వద్ద ఆ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన డీసీఎం డ్రైవర్‌ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. అప్పట్లో ఈ విషయంలో స్థాని క పోలీసులు విచారణ చేస్తే మర్రిగూడ నుంచి కాకినాడకు తరలిస్తున్నట్లు వెల్లడైంది. డీసీఎం యజమాని పోలీసులకు లొంగిపోగా, ఆయన ఇచ్చిన స మాచారం మేరకు పోలీసులు లోతైనా చేసినా ఫలితం లేకుండాపోయింది. గట్టుప్పల మండలకేంద్రంలో రెండు మిల్లుల యజమానులు పీడీఎస్‌ బి య్యాన్ని కోనుగోలు చేస్తున్నారనే పక్కా సమాచారంతో అప్పటి పోలీసు అ ధికారులు తమ సిబ్బందితో కలిసి దాడులు చేసి, వాటిని సీజ్‌ చేయించారు. తుమ్మలపల్లి, బంగారిగడ్డ, తాస్కానిగూడెం, ఇడికుడ, కొండాపురం, గట్టుప్పల తదితర ప్రాంతాల్లో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న కొంతమంది చిరు వ్యాపారులను పోలీసులు పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. తాజాగా చండూరు మండలంలో ఓ గ్రామంలో పీడీఎస్‌ బియ్యం దందా కొ నసాగుతుందని పక్కా సమాచారం రావడంతో చండూరు ఎస్‌ఐ శివకుమా ర్‌ తమ సిబ్బందితో కలిసి నిల్వ చేసి ఉన్న బియ్యాన్ని సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

చండూరు మీదుగా

పీడీఎస్‌ బియ్యం అక్రమ దందా మర్రిగూడ, నాంపల్లి మండలాల నుం చి చండూరు మండలం వయా బంగారిగడ్డ, ఇడికుడ, తాస్కానిగూడెం మీ దుగా మునుగోడుకు చేరుకుని నల్లగొండకు తరలిస్తున్నారని సమాచారం. అక్కడి నుంచి రాష్ట్ర సరిహద్దు దాటించేంత వరకు సదరు వ్యాపారి బాధ్య త తీసుకుంటారని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారి చూసుకుంటారని తెలుస్తోంది. ఈ దందా రెండేళ్లుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

దందా ఇలా సాగుతోంది

ఆటోలో బియ్యాన్ని సేకరిస్తూ పట్టుబడిన వ్యాపారులు రూట్‌ మార్చుకున్నారు. ఆటోలో తిరిగి సేకరిస్తే బయట పట్టుబడుతాయేయోనని రాత్రి వేళలో ద్విచక్ర వాహనంపై ఒక్కొక్క ఇంటికి తిరుగుతూ బియ్యాన్ని సేకరిస్తారు. ఆ బియ్యాన్ని తమకు అనుకూలంగా ఉన్నవారి ఇంట్లో డంప్‌ చేసి అర్థరాత్రి సమయంలో ఒకేసారి ఆటోలో తరలిస్తున్నారు. కొంతమంది రై స్‌ మిల్లు యజమానులు కూడా రేషన్‌బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని రీసైక్లింగ్‌ చేసి తిరిగి మరలా గోదాంలకు సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీ య సమాచారం. రైస్‌ మిల్లు యాజమానులు గ్రామాల్లో బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు తమకు అనుకూలమైన కొంతమందితో ఇంటింటికీ తి రుగుతూ బియ్యాన్ని సేకరిస్తారు. ఎక్కువ మొత్తంలో సేకరించిన బియ్యా న్ని అదే ఏరియాలో డంప్‌ చేస్తారు. రాత్రి సమయంలో వాహనాల్లో గు ట్టు చప్పుడు కాకుండా మిల్లులకు తరలిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులు వినియోగదారుల నుంచి పీడీఎస్‌ బియ్యం కిలో రూ. 15 నుంచి రూ.18 వరకు కొనుగోలు చేసి రైస్‌మిల్ల్లుల యాజమానులకు రూ. 20లకు విక్రయిస్తున్నారు. వినియోగదారులే రైస్‌మిల్లుకు తీసుకెళ్తే రూ. 19 నుంచి 20వరకు ఇస్తున్నారు. కొంతమంది వ్యాపారులు పోలీసులు, అధికారుల కళ్లుగప్పి అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిపాయలు, పండ్లు తదితర వ్యాపారం చేస్తున్నట్లు నటి స్తూ ఆటో వాహనాల్లో వీధు ల్లో తిరుగుతూ పీడీఎస్‌ బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత సవిల్‌ సప్లై అధికారులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయంపై చండూరు సివిల్‌ సప్లై అధికారిని వివరణ కోరగా సమాధానం ఇవ్వలేదు.

వ్యాపారులపై నిఘా ఉంచాం

చండూరు మండలంలో పీడీఎస్‌ బియ్యం దందాపై నిఘా పెంచాం. అక్రమ వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మండల పరిధిలో ఉన్న రైస్‌మిల్లులపై దృష్టి పెట్టాం. ఎవరైనా బియ్యం క్రయవిక్రయాలు చేస్తే సమాచారం ఇవ్వం డి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. క్రిమినల్‌ కేసులు నమోదు చేసి శిక్షి స్తాం. పీడీఎస్‌ అక్రమ దందా గురించి తెలిస్తే ఫోన్‌ ద్వారానైనా లేదా లిఖి తపూర్వకంగా ఫిర్యాదు చేసి సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకుంటాం. వినియోగదారుల బియ్యాన్ని వ్యాపారులు విక్రయించకూడదు.

- శివకుమార్‌, ఎస్‌ఐ, చండూరు

Updated Date - Apr 15 , 2026 | 11:38 PM