రేషన్... పరేషాన్
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:20 AM
ప్రభుత్వం అందించే రేషన్‌సరుకుల కోసం నూతన పంచాయతీల్లోని లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వివిధరకాల సరుకులు పంపిణీ చేసినా ప్రస్తుతం అందజేస్తున్న ఒక్క రేషన్ బియ్యం కోసం కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.
కొత్త గ్రామపంచాయతీల్లో దుకాణాలు కరువు
సరుకుల కోసం కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట (కలెక్టరేట్): ప్రభుత్వం అందించే రేషన్‌సరుకుల కోసం నూతన పంచాయతీల్లోని లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వివిధరకాల సరుకులు పంపిణీ చేసినా ప్రస్తుతం అందజేస్తున్న ఒక్క రేషన్ బియ్యం కోసం కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. నూతన పంచాయతీల్లో దుకాణాలను ఏర్పాటు చేయకపోవడంతో సమీపంలోని, పాత పంచాయతీల్లోని రేషన్‌దుకాణాల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నూతన పంచాయతీలు ఏర్పడి తొమ్మిదేళ్లు నేటికీ రేషన్ దుకాణాలు మాత్రం ఏర్పాటుకాలేదు. దీంతో ఇబ్బందులు తప్పడంలేదు.
జిల్లాలో తొమ్మిదేళ్ల కిందటే నూతన పంచాయతీలను ఏర్పాటుచేశారు. 2016 అక్టోబరులో సూర్యాపేట జిల్లాగా ఏర్పడింది. అప్పుడు జిల్లాలో 323 పంచాయతీలు ఉన్నాయి. అనంతరం 2017లో 500 జనాభా ఉన్న తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం 475 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అయితే పాత గ్రామపంచాయతీల్లో మాత్రమే రేషన్ దుకాణాలు ఉం డగా నూతన పంచాయతీల్లో రేషన్ దుకాణాలు ఏర్పాటుచేయలేదు. దీంతో ప్రతి నెలా రేషన్ బియ్యం కోసం కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోం ది. చాలాచోట్ల సుమారు మూడు కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి బియ్యం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంతదూరం వెళ్లి బియ్యం తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, మహిళలు ప్రధానంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాలో 610 రేషన్ దుకాణాలు
జిల్లాలో ప్రస్తుతం 610 రేషన్ దుకాణాలకు 3,71,783 రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో ఆహారభద్రత కార్డులు 3,51,922 ఉండగా, 19,829 అంత్యోదయ కార్డులు, 32 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి.ఆయా రేషన్‌కార్డుల్లో 10,81,792 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ ప్రతి నెలా 6,86 4 మెట్రిక్ టన్నుల బి య్యం పంపిణీ చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం రూ.34 కోట్లను ఖర్చు చేస్తోంది.
152 దుకాణాలు ఇంకా అవసరం
జిల్లాలో ప్రస్తుతమున్న రేషన్ దుకాణా లు కాకుండా ఇంకా 152 దుకాణాలు అవస రం ఉన్నాయి. వీటి ఏర్పాటుతో ప్రతీ పంచాయతీలో రేషన్‌దుకాణం ఏర్పాటవుతుంది. అయితే ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఒక గ్రామంలో కనీసం 500 రేషన్ కార్డులు ఉంటనే దుకాణం ఏర్పాటుచేయాల్సి ఉంది. రేషన్ దుకాణం ఏర్పాటు చేస్తే డీలరుకు సరుకుల పంపిణీ ద్వారా వచ్చే కమీషన్ కనీసం అయినా ఉండాలి. అందు కోసం కనీసం 500 కార్డులు ఉండాలనే నిబంధన ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. కాకపోతే ప్రస్తుతం ఉన్న కార్డుల సంఖ్యను గమనించి కొంత మొత్తంలో కార్డులు తక్కువగా ఉన్నా రేషన్ దుకాణం ఏర్పాటు చేసేందుకు సంబంధిత గ్రామాల నుంచి ఆర్డీవోల ద్వారా దరఖాస్తులు వస్తే నూతన రేషన్ దుకాణం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.
మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది : జాటోత్ రవీందర్‌నాయక్, దుబ్బతండా మాజీ సర్పంచ్, ఆత్మకూర్(ఎస్) మండలం.
నూతన పంచాయతీగా ఏర్పడిన దుబ్బతండాలో రేషన్ దుకాణం లేదు. దీంతో పాత పంచాయతీ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటినాయక్‌తండాకు వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. బియ్యం కోసం కాలినడకన మహిళలు, వృద్ధులు వెళ్లలేకపోతున్నారు. సరైన సమాచారం తెలియక రెండు నుంచి మూడు సార్లు వెళ్లాల్సి వస్తోంది. కూలీ పనులు, వ్యవసాయ పనులు వదిలి వెళ్తున్నారు. తండాలో 200లకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని ఇప్పటికే పలుమార్లు అఽధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదు.
నిబంధనల మేరకు దుకాణాలు ఏర్పాటు చేస్తాం : మోహన్‌బాబు, డీఎ్‌సవో సూర్యాపేట
ప్రభుత్వ నిబంధనల మేరకు కొత్త రేషన్‌దుకాణాలు ఏర్పాటు చేస్తాం. రేషన్ దుకాణం ఏర్పాటుచేయాలం టే ఆ గ్రామంలో కనీసం 500 కార్డు లు ఉండాలి. కొంత తక్కువగా ఉన్నా నూతన దుకాణం ఏర్పాటుచేయవచ్చు. కార్డులు తక్కువైతే డీలర్లకు అందించే కమీషన్ సరిపోదు. దు కాణాల ఏర్పాటుపై గ్రామాల నుంచి అర్జీలు వస్తే కలెక్టర్ ఆదేశాల మేరకు దుకాణాలు ఏర్పాటు చేస్తాం.