మెరుగైన వైద్య సేవలను అందించాలి
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:46 AM
ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
కలెక్టర్ అనురాగ్ జయంతి
చౌటుప్పల్ టౌన, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సోమవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతీ విభాగాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలను పలకరించారు. వైద్య సేవల గురించి ఆరా తీశారు. ప్రతీ రోజు ఓపీకి ఎంత మంది వస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. అందుకుగాను ఓపీ రిజిస్టర్‌ను కలెక్టర్ పరిశీలించారు. గత నెలలో సాధారణ ప్రసవాలు ఎన్ని జరిగాయని ఆరా తీస్తూ, సాధారణ ప్రసవాలను పెంచాలన్నారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఎంత మంది ఉన్నారు? పగటి పూట ఎంతమంది విదులు నిర్వహిస్తున్నారు? రాత్రి పూట ఎంత మంది విధులు నిర్వహిస్తున్నారని సూపరింటెండెంట్ డాక్టర్ అలివేలును కలెక్టర్ ప్రశ్నించారు. అత్యవసర కేసులు వచ్చినప్పుడు అక్కడే వైద్యం అందిస్తున్నారా? లేక బయటకు పంపిస్తున్నారా? అని ప్రశ్నించారు. రోజూ మంచి బోజనం పెడుతున్నారా? రుచి కరంగా ఉంటుందా? అని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీ రూమ్‌లో మందుల స్టాక్ రిజిస్టర్‌తో పాటు మందులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించాలని సూచించారు. రోగుల పట్ల ఆప్యాయతగా వ్యవహరించాలని, కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకోవాలని ఆయన అన్నారు.
రోగులకు అందని అత్యవసర సేవలు
రోగులకు అత్యవసర వైద్య సేవలు అందడం లేదని, అదే విదంగా వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించక పోవడంతో రోగులు ఇబ్బంది పడవలసి వస్తుందని కలెక్టర్ దృష్టికి చౌటుప్పల్ మునిసిపాలిటీ చైర్ పర్సన మొగుదాల పావని రమే్‌షగౌడ్ తెచ్చారు. సాధారణ ప్రసవాలతో పాటు రోగులకు అందించే వైద్య సేవలు కూడ అంతంత మాత్రంగానే ఉన్నాయని, ఈ ఆసుపత్రి పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ను ఆమె కోరారు. అత్యవసనర సేవలకు చెందిన కొన్ని పరికరాలు పనిచేయకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించవలసి వస్తుందని ఆమె తెలిపారు. ఈ తనిఖీల్లో కాంగ్రెస్ మునుగోడు అసెంబ్లీ ఎన్నికల ఇనచార్జ్ పబ్బు రాజు గౌడ్, మునిసిపల్ వైస్ చైర్మన గోశిక వినయ్‌కుమార్, కౌన్సిలర్లు కొయ్యడ శేఖర్, ఊదరి యాదగిరి, ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత ఉన్నారు. కాగా తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి విద్యుత సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఆసుపత్రి భవనాన్ని పూర్తి చేయించాలి: సీపీఎం
చౌటుప్పల్ పట్టణంలో జరుగుతున్న 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని సీపీఎం పట్టణ కార్యదర్శి గోశిక కరుణాకర్, కౌన్సిలర్ బత్తుల జయమ్మ డిమాండ్ చేశారు. నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి భవనం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్దకు వచ్చిన కలెక్టర్ అనురాగ్ జయంతికి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ.పాషా, అవ్వారు రామేశ్వరి, బత్తుల దాసు, నాయకులు బండారు నర్సింహ, బొడ్డు అంజిరెడ్డి, కే.ఆనంద్, ఆకుల ధర్మయ్య, ఏ.నందీశ్వర్, శ్రీనివా్‌సరెడ్డి, చీకూరి ఈదయ్య, పంతంగి సంద్య, యాదమ్మ, సుర్వి జయమ్మ, సోమరాజ్, జానీ, రాములు పాల్గొన్నారు.