నల్లగొండలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:37 AM
నల్లగొండ క్రైం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల ఓ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను నల్లగొండ టూటౌన పోలీసులు అరెస్టు చేశారు.
నల్లగొండ క్రైం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల ఓ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను నల్లగొండ టూటౌన పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన సీఐ రాఘవరావు ఎస్‌ఐ సైదులుతో కలిసి వివరాలు వెల్లడించారు. శనివారం సాయంత్రం 4గంటల సమయం లో కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు మరో ఇద్దరిని పట్టుకున్నారు. గుండ్రెడ్డి వెంకట్‌రెడ్డి, లక్కమోరపు నవ్య కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డబ్బులు అవసరం ఉన్న యువతులు, వివాహితులతో పరిచయం పెంచుకొని వారిని అద్దె ఇంటికి పిలిపించే వారు. వారి ఫొటోలను వాట్సప్ ద్వారా కస్టమర్లకు పంపించి రేటు కుదిరిన తరువాత అదే ఇంట్లో వ్యభిచారం నిర్వహించే వారు. ఇద్దరు యవతులు, మరో వ్యక్తులతో వ్యభిచారం నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఏ1 గుండ్రెడ్డి వెంకట్ రెడ్డి, ఏ-2 లక్కమోరపు నవ్యతో పాటు ఏ-3 ఉదయ్, ఏ-4 శివకృష్ణలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న అనంతరం రిమాండ్‌కు తరలించారు. బాధిత యువతులను కౌన్సెలింగ్ కోసం సఖీ సెంటర్‌కు పంపించారు.