మెట్ట పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:57 PM
రైతులు మెట్ట పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని, పత్తి సాగులో రైతుల అధిక సాంద్రత నాట్లతో పాటు సమగ్ర పంట యాజమాన్యం (ఐసీఎం) విధానాలను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కోరారు.
ఆలేరు, జులై 3 (ఆంధ్రజ్యోతి) : రైతులు మెట్ట పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని, పత్తి సాగులో రైతుల అధిక సాంద్రత నాట్లతో పాటు సమగ్ర పంట యాజమాన్యం (ఐసీఎం) విధానాలను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కోరారు. శుక్రవారం ఆలేరు మండల ప్రజాపరిషత కార్యాలయంలో కపాస్ కాంతి పథకం ద్వారా రైతులకు సబ్సిడీపై పత్తి విత్తనాలు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన రైతులనుద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, లామీనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కంది, పెసర, మినుము వంటి ఆరుతడి పంటలతో పాటు అంతర్ పంటలను సాగు చేయాలని కోరారు. ఈ పంటల ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, సబ్సిడీ పథకాలు, శాస్త్రీయ సాగు విధానాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి, ఆత్మ పీడీ దేవ్‌సింగ్, ఏవో శ్రీనివాస్, టీపీసీసీ ప్పధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన ఐనాల చైతన్య మహేందర్‌రెడ్డి, మున్సిపాలిటీ ఛైర్ పర్సన బీజని బాలమణి, వైస్ ఛైర్మన అంగడి ఆంజనేయులు, నాయకులు ఎజాజ్, శ్రీనివాస్, లక్ష్మణ్ పలువురు మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఉన్నారు.