Share News

ఏడాదిగా మారని ధరల పట్టిక

ABN , Publish Date - Apr 15 , 2026 | 11:29 PM

తిరుమలగిరి మార్కెట్‌ అధికారుల తీరు, పరిసరాల పరిశుభ్రతపై రైతులు మండిపడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల పట్టికపై గతేడాది ధరలే దర్శనమిస్తున్నాయి.

ఏడాదిగా మారని ధరల పట్టిక

(ఆంధ్రజ్యోతి- తిరుమలగిరి)

తిరుమలగిరి మార్కెట్‌ అధికారుల తీరు, పరిసరాల పరిశుభ్రతపై రైతులు మండిపడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల పట్టికపై గతేడాది ధరలే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మద్దతు ధర పెరగడంతో పాటు ఇతర ఉత్పత్తుల ధరలూ పెరిగాయి. కానీ మార్కెట్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో బోర్డులో గతేడాది ధరలు ఇంకా మార్చలేదు. అదేవిధంగా రైతుల కోసం ఏర్పాటు చేసిన సమాచార కేంద్రం పనిచేయడం లేదు. కొన్ని నెలలుగా మూతబడి ఉంది. గది నిండా పట్టాలు(కవర్లు) వేసి అపరిశుభ్రంగా మార్చేశారు. మార్కెట్‌లో ధరల పట్టిక మార్చడంతో పాటు సమాచారం కేంద్రాన్ని తెరవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Apr 15 , 2026 | 11:29 PM