Share News

‘యాసంగి’కి సన్నద్ధం

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:08 AM

యాసంగి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వానాకాలం సీజన్‌ దాదాపు ముగిసింది. ఈ సీజన్‌కు సంబంధించి ఓ వైపు వరి కోతలు, మరోవైపు కొనుగో ళ్లు, పలుచోట్ల పత్తి ఏరివేత పనులు కొనసాగుతున్నా యి. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్‌కు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

‘యాసంగి’కి సన్నద్ధం

గతంతో పోలిస్తే సగం తగ్గనున్న సాగు

గతేడాది 5.20లక్షల ఎకరాల్లో పంటల సాగు

ఈసారి పర్యాయం 2.20 లక్షల ఎకరాల్లో మాత్రమే

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట): యాసంగి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వానాకాలం సీజన్‌ దాదాపు ముగిసింది. ఈ సీజన్‌కు సంబంధించి ఓ వైపు వరి కోతలు, మరోవైపు కొనుగో ళ్లు, పలుచోట్ల పత్తి ఏరివేత పనులు కొనసాగుతున్నా యి. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్‌కు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రాజెక్టుల నుంచి సాగునీటి విడుదల ఉండదని అధికారులు స్పష్టం చేయడంతో కేవలం బోర్లు, బావులు ఉన్న రైతులు మాత్రమే పంటలు సాగుకు సమాయత్తమవుతున్నారు. అయితే నీటి లభ్యత లేనికారణంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

జిల్లాలో యాసంగి సీజన్‌లో అన్నిరకాల పంటలు కలిపి 2.20లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. ఇందులో సుమారు 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. ఇంకా మొక్కజొన్న, వేరుశనగ, మినుములుతో పాటు ఇతర పంటలు కలిపి 90వేల ఎకరాలలో సాగు అవుతాయని అంచనా. జిల్లాలో ప్రధానంగా కోదాడ, హుజుర్‌నగర్‌ నియోజకవర్గాల పరిధిలో నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ద్వారానే పంటలు సాగు చేసే అవకాశం ఉంది. యాసంగి సీజన్‌కు సంబంధించి నీటిని విడుదల చేసే అవకాశాలు లేవు. దీంతో రైతులకు ఉన్న సొంత నీటి వనరులపై ఆధారపడి వరి సాగు చేయనున్నారు. అదే విధంగా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలో మూసీ, ఎస్సారెస్పీ నీరు విడుదలకు అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో వరి కంటే మెట్ట పంటలు ఎక్కువగా సాగు చేసే అవకాశాలున్నాయి.

సన్నాల సాగుపై ఆసక్తి

సన్నరకం వరి పంటను యాసంగిలో ఎక్కువగా సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. సన్నరకం సాగుతో మంచి దిగుబడులు పొందడంతో పాటు ధర కూడా గరిష్ఠంగా వచ్చే అవకాశాలున్నాయి. గతంలో సన్నరకం పంట నాలుగు నెలలుకు పైగా చేతికి వచ్చేది కాదు. కానీ ఇటీవల పలు కంపెనీల విత్తనాలు కేవలం 100 నుంచి 120 రోజుల్లో చేతికి వస్తుంది. మార్కెట్‌లో ధర కూడా ఎక్కువగా ఉండడంతో రైతులు సన్నాల సాగుకు ఆసక్తి కనబరిచే అవకాశం ఉంది.

గత సీజన్‌లో 5.20 లక్షల ఎకరాల్లో సాగు

గతేడాది యాసంగి సీజన్‌లో రైతులు అన్నిరకాల పంటలు కలిపి 5.20 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అందులో వరి 4.94లక్షల ఎకరాలు, ఆరుతడి పంటలైన కందులు, పెసర, వేరుశనగతో పాటు ఇతర పంటలు కలిపి 25వేల ఎకరాల్లో సాగు చేశారు. కానీ, ఈసారి సీజన్‌లో మాత్రం రైతులు వరి ఎక్కువగా సాగు చేయలేని పరిస్థితి నెలకొంది.

నారుమళ్లు సిద్ధం

వానాకాలం సీజన్‌ ముగిసిపోవడంతో రైతులు యాసంగి సీజన్‌ వైపు దృష్టి సారిస్తున్నారు. వివిధరకాల పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వరితో పాటు వేరుశనగ, మొక్కజొన్న, మినుములు సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. అందుకోసం రైతులు ఇప్పటికే నారుమళ్లను సిద్ధం చేస్తున్నారు. మెట్ట పంటల సాగు కోసం వ్యవసాయ భూములను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే రైతులు దాదాపు విత్తనాలు కొనుగోలు చేశారు. ప్రభుత్వం రైతులకు అవసరమైన ఎరువులు సిద్ధంగా ఉంచింది.

ఆరుతడి పంటలు సాగు చేయాలి: శ్రీధర్‌రెడ్డి, డీఏవో, సూర్యాపేట.

యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి. ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత తలెత్తింది. దీంతో పంటల సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. వరికి ప్రత్యామ్నాయంగా నీటి అవసరం తక్కువగా ఉండే మెట్టపంటలను సాగు చేసుకోవాలి. వరి ఎక్కువగా సాగు చేసి నష్టపోవద్దు. పంటల సాగుపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం.

వ్యవసాయ పనుల్లో రైతులు

పెన్‌పహాడ్‌, నవంబ రు 11 (ఆంధ్రజ్యోతి) : మండలంలో యాసంగి సీజన్‌కు సంబంధించి సా గు పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. వరి సాగు కు సంబంధించి పలుచోట్ల నార్లు పోస్తుండగా, మరికొన్నిచోట్ల పొలాలు దమ్ము చేస్తున్నారు. ప్రభు త్వం ఆరుతడి పంటలు సాగు చేయాల ని ప్రచారం చేస్తున్నా బోర్లు, బావులు, చెరువులు కింద ఉన్న రైతులు యా సంగి సీజన్‌లో వరి సేద్యానికి మొగ్గు చూపిస్తున్నారు. ఎస్సారెస్పీ, సాగర్‌ ఆయకట్టులో నీటి వసతులు లేకపోవడంతో వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో చాలామంది బోర్లు వేసేందుకు సిద్ధపడుతున్నారు.

Updated Date - Nov 12 , 2026 | 12:08 AM