Share News

ధాన్యం టెండర్లకు సన్నాహాలు

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:07 AM

యాసంగి సీజన్‌లో అంచనాలకు మించి వచ్చిన దిగుబడిని రికార్డు స్థాయిలో సేకరించిన ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించేందుకు పౌరసరఫరాలశాఖ సన్నాహాలు చేస్తోంది. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యాసం గి సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్ల వద్ద నిల్వ సామర్ధ్యం లేకపోవడంతో ప్రైవేట్‌ ఇంటర్మీడియట్‌ గోదాముల్లో నిల్వ చేశా రు.

 ధాన్యం టెండర్లకు సన్నాహాలు

మిషన్‌ ‘కే-100’ కార్యాచరణ

జిల్లాలో 1.20లక్షల మెట్రిక్‌ టన్నుల ప్రతిపాదన

రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్‌

ప్రైవేట్‌ గోదాముల నుంచి ధాన్యం తరలింపే లక్ష్యం

నెలకు రూ.1.50కోట్ల అద్దె భారం నుంచి ఊరట

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): యాసంగి సీజన్‌లో అంచనాలకు మించి వచ్చిన దిగుబడిని రికార్డు స్థాయిలో సేకరించిన ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించేందుకు పౌరసరఫరాలశాఖ సన్నాహాలు చేస్తోంది. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యాసం గి సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్ల వద్ద నిల్వ సామర్ధ్యం లేకపోవడంతో ప్రైవేట్‌ ఇంటర్మీడియట్‌ గోదాముల్లో నిల్వ చేశా రు. ఈ గోదాముల అద్దె భారం నుంచి తప్పించుకోవడమేగాక, రానున్న వానాకాలం ధాన్యం సేకరణ నాటికి గోదాములను ఖాళీగా ఉంచాలనే లక్ష్యంగా టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ప్రకటించిన మిషన్‌ కే-100 (వంద రోజుల) కార్యాచరణలో భాగంగా దొడ్డు రకం ధాన్యం విక్రయానికి టెండర్లు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా ధాన్యం సేకరణ చేసిన జిల్లాల్లో సుమారు 7లక్షల టన్నులను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. లక్ష్యానికి మించి ధాన్యం సేకరణ చేసిన జిల్లాలో 1.20లక్షల మెట్రిక్‌ టన్నులకు టెండర్‌ నిర్వహించడానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు జిల్లా అధికారులు పూర్తిచేశారు.

24 గోదాముల్లో 1.20లక్షల మెట్రిక్‌ టన్నులు

జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చింది. జిల్లాలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 5.22లక్షల మె ట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. జి ల్లాలోని రైస్‌ మిల్లులతో పాటు ప్రభుత్వ గోదాముల్లో నిల్వ సామర్థ్యం లేకపోవడంతో ఈ ధా న్యాన్ని జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో ప్రైవే ట్‌కు చెందిన మొత్తం 24 గోదాముల్లో సుమారు 1.20లక్షల మెట్రిక్‌ టన్నులు నిల్వ చేశారు. అయితే పౌరసరఫరాలశాఖ టెండర్ల ద్వారా ధాన్యాన్ని విక్రయించాలని నిర్ణయించింది. దీంతో అద్దె, భద్రత వంటి సమస్యలు ఉన్న ప్రైవేట్‌ గోదాముల్లోని ధాన్యం విక్రయించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదించింది. మార్గదర్శకాలమేరకు ధాన్యం విక్రయించేందుకు నాణ్యత పరిశీలన, తదితర అంశాలను పూర్తిచేసి సంసిద్ధమైంది.

మిషన్‌ కే-100 కార్యాచరణ

వానాకాలం పంట దిగుబడి రాకముందే ధాన్యం సేకరణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మిషన్‌ కే-100 (వంద రోజుల) కార్యాచరణను రూపొందించారు. ఈ ప్రత్యేక మిషన్‌ ద్వారా 100 రోజుల విస్తృత ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించారు. వానాకాలం పంట దిగుబడి వచ్చే వర కు పౌరసరఫరాలశాఖ తిరిగి ధా న్యం సేకరణకు అవసరమైన గోదాములు, రవాణా, ఆర్థికపర సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎఫ్‌సీఐ పాత బకాయిలను విడుదల చేయాలని ఒత్తిడి చేయడంతోపాటు, కొత్తగా బియ్యం అప్పగించేందుకు చర్యలు తీసుకోనున్నారు. తద్వారా వానాకాలం ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణను అమలు చేయనున్నారు.

రూ.1.50 కోట్ల అద్దె చెల్లింపు

పౌరసరఫరాల సంస్థకు ఆర్థిక భారం తప్పించడమేగాక, ప్రైవేట్‌ గోదాముల్లో భద్రత వంటి సమస్యల నుంచి ఊర ట కల్పించేందుకు మిషన్‌ కే-100 కార్యాచరణను అమలు చేస్తున్నారు. జిల్లాలో ప్రైవేట్‌ గోదాముల్లో సుమారు 1.24లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం నిల్వ ఉంది. ఈ గోదాములకు నెల కు 40కిలోల బస్తాకు రూ.5 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన జిల్లాలో ప్రైవేట్‌ గోదాముల్లో ఉన్న 30లక్షల బస్తాల ధాన్యానికి ప్రతీ నెల రూ.1.50కోట్ల అద్దె చెల్లిస్తున్నారు. మిషన్‌ కే-100 కార్యాచరణలో త్వరితగతిన ధాన్యం విక్రయం, ఎఫ్‌సీఐకి కేటాయింపు, నిధుల సమీకరణ అంశంలో భాగంగా జిల్లాలో 1.20లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని టెండర్‌ ద్వారా విక్రయించనుండటంతో నెలకు సుమారు రూ.1.50కోట్ల అద్దె భారం తప్పనుంది.

నాలుగైదు రోజుల్లో టెండర్‌ నోటిఫికేషన్‌

జిల్లాతో పాటు సూర్యాపేట, మెదక్‌, వనపర్తి, జనగామ, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, కరీంనగర్‌ తదితర జిల్లాలో దొడ్డు రకం ధాన్యం విక్రయానికి టెండర్‌ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించారు. పలు జిల్లాల్లో 7లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం టెండర్‌ నిర్వహణకు ఇ-టెక్‌ ఇన్నోవేటివ్‌ సర్వీసె్‌సకు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఐఆర్‌-64 లేదా 1010 రకాలను చెందిన ధాన్యం విక్రయానికి ఈ సంస్థ గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించనుంది. జిల్లాలో సైతం 1.20లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించేందుకు నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్‌లో కనీస ధరతో పాటు చెల్లింపులు, తదితర నియమ నిబంధనలను ప్రకటించనున్నారు.

జిల్లాలో ధాన్యం విక్రయానికి ఏర్పాట్లు: హరికృష్ణ, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌

మిషన్‌ కే-100 వంద రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో ఇంటర్మీడియట్‌ గోదాముల్లో నిల్వ ఉన్న ధాన్యం విక్రయానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం నియమించిన ఏజెన్సీ గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించి ధాన్యం విక్రయించనుంది. ఈమేరకు త్వరలోనే కనీస విక్రయ ధర, నియమనిబంధనలతో కూడిన నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

Updated Date - Jul 08 , 2026 | 12:07 AM